5 Men In Pak : మేకపై అత్యాచారం, జంతువులకు కూడ రక్షణ లేదా ? ప్రధానిపై సెటైర్లు

ఓ మేకపై...కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భారత్ పొరుగు దేశం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఒకరా జిల్లాలోని ఓ కార్మికుడి ఇంటి ముందున్న మేకను అయిదుగురు వ్యక్తులు అపహరించారు.

5 Men In Pak Rape, Kill A Goat : సమాజంలో అవమానీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సభ్యసమాజం తలదించుకొనేలా ఈ ఘటనలు ఉంటున్నాయి. మహిళలపై దారుణాలకు తెగబడుతున్న కామాంధులు..జంతువులను కూడా వదలడం లేదు. కామంతో కళ్లు మూసుకపోయి..అసలు ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో వారుంటున్నారు. ఓ మేకపై…కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భారత్ పొరుగు దేశం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది.

Read More : Apple iPhone 13 Series : ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే?

వివరాల్లోకి వెళితే…

ఒకరా జిల్లాలోని ఓ కార్మికుడి ఇంటి ముందున్న మేకను అయిదుగురు వ్యక్తులు అపహరించారు. ఒకరి తర్వాత..మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మేకను చంపేశారు. అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. వీరు పారిపోవడాన్ని అక్కడనే ఉన్న స్థానికులు చూశారు. ఈ ఘటన పాకిస్తాన్ లో తీవ్ర దుమారం రేపుతోంది. అఘాయిత్యాన్ని వ్యతిరేకిస్తూ..సోషల్ మీడియాలో తమ నిరసనలు తెలియచేస్తున్నారు.

Read More : Ind vs SL : లంకేయులు కప్ కొట్టేశారు, చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్‌

పోస్టుల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ట్యాగ్ చేస్తున్నారు. పీఎం గారు..మేకలు కూడా వాటి వస్త్రాధరణ కారణంగానే అత్యాచారానికి గురవుతున్నాయి కదా అంటూ..వ్యగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే..గత నెలలో ఇమ్రాన్ ఖాన్ మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆడవారు పూర్తిగా వస్త్రాలు ధరించాలని, వారి వేషధారణ ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదంటూ…ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఉచిత సలహాలు ఇచ్చారు.

Read More : దేశంలో సగం కేసులు అక్కడి నుంచే.. ఎందుకంటే..?

దీనిపై తీవ్ర దుమారమే రేగింది. ఈ ఘటనపై పాక్ నటి మథిర స్పందించారు. మేకపై అఘాయిత్యానికి సంబంధించిన న్యూస్ ను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. జంతువులపై కూడా దుస్తులు ధరించడం అవసరం అంటూ సెటైర్లు వేశారు. నగ్న జంతువులు కూడా పురుషులపై ప్రభావం చూపుతాయా ? అంటూ పోస్టులో పేర్కొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు