Ind vs SL : లంకేయులు కప్ కొట్టేశారు, చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్‌

కొలంబో వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన టీ20లో లంకేయులు కప్‌ కొట్టేశారు. భారత్‌పై ఏడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు గెలిచింది. మొదటి మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించగా.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ శ్రీలంక విజయం సాధించింది. దీంతో.. మూడు టీ-20ల సిరీస్‌ను రెండు ఒకటి తేడాతో లంక టీమ్‌ కైవసం చేసుకుంది.

Ind vs SL : లంకేయులు కప్ కొట్టేశారు, చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్‌

India

SL beat Ind : కొలంబో వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన టీ20లో లంకేయులు కప్‌ కొట్టేశారు. భారత్‌పై ఏడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు గెలిచింది. మొదటి మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించగా.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ శ్రీలంక విజయం సాధించింది. దీంతో.. మూడు టీ-20ల సిరీస్‌ను రెండు ఒకటి తేడాతో లంక టీమ్‌ కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు దారుణంగా ఓడింది.

Read More : Ongole : చీకట్లో పెద్దాసుపత్రి, టార్చ్ లైట్లతో రోగులకు చికిత్స

కెప్టెన్ శిఖర్ ధవన్‌తో పాటు బ్యాట్స్‌మెన్స్‌ అంతా విఫలం కావడంతో భారత్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. టీ20 సిరీస్‌ మూడో మ్యాచ్‌లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, జట్టు వైస్ కెప్టెన్, బౌలర్ భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్స్‌ అంతా రాణించలేకపోయారు. దీంతో భారత్ 20 ఓవర్లలో కేవలం 81 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read More :Tokyo Olympics Condom : వావ్… కండోమ్ వాడింది, మెడల్ గెలిచింది

82 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కూడా మొదటి మూడు వికెట్లను వేగంగా కోల్పోయింది. అయితే చేయాల్సింది తక్కువ స్కోరును 14 పాయింట్‌ 3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బౌలర్ హసరంగకు దక్కింది.

స్కోర్లు : భారత్‌- 81/8, శ్రీలంక- 82/3
భారత్‌ బ్యాటింగ్‌ : కుల్దీప్‌ 23, భువనేశ్వర్‌ 16, రుత్‌రాజ్‌ 14
శ్రీలంక బౌలింగ్‌ : హసరంగ 4, శనక 2, చమీర, మెండిస్‌కు ఒక్కో వికెట్‌.
శ్రీలంక బ్యాటింగ్‌ : డిసిల్వా 23 నాటౌట్‌, భనుక 18, హసరంగ 14 నాటౌట్‌.