Ongole : చీకట్లో పెద్దాసుపత్రి, టార్చ్ లైట్లతో రోగులకు చికిత్స

అదో పెద్దాసుపత్రి...ఒంగోలు పట్టణానికి అదే అతి పెద్ద ఆసుపత్రి. ఇక్కడకు చాలా మంది రోగులు వస్తుంటారు. ఈ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంతో మంది వచ్చి రోగులు వచ్చిపోయే ఈ ఆసుపత్రి చీకట్లో మగ్గుతోంది. అంధకారం అలుముకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Ongole : చీకట్లో పెద్దాసుపత్రి, టార్చ్ లైట్లతో రోగులకు చికిత్స

Ongole

Rims Hospital : అదో పెద్దాసుపత్రి…ఒంగోలు పట్టణానికి అదే అతి పెద్ద ఆసుపత్రి. ఇక్కడకు చాలా మంది రోగులు వస్తుంటారు. ఈ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంతో మంది వచ్చి రోగులు వచ్చిపోయే ఈ ఆసుపత్రి చీకట్లో మగ్గుతోంది. అంధకారం అలుముకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన 2021, జూలై 29వ తేదీ గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులకు టార్చ్ లైట్ల సహాయంతో చికిత్స చేశారు. కరోనా వైరస్ సోకిన వారు కూడా ఇక్కడ ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరు సుమారు 200 మంది ఉన్నట్లు సమాచారం. విద్యుత్‌ సమస్యతో.. రోగులు, వైద్యులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Read More : Tokyo Olympics Condom : వావ్… కండోమ్ వాడింది, మెడల్ గెలిచింది