Tokyo Olympics Condom : వావ్… కండోమ్ వాడింది, మెడల్ గెలిచింది

టోక్యో ఒలింపిక్స్ లో ఎన్నో ఇంట్రస్టింగ్ ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నడూ చూడనివి, ఎప్పుడూ విననవి చోటు చేసుకుంటున్నాయి. ఓ కోచ్ తన ప్లేయర్ కి లైవ్ లో మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. మరో కోచ్ తన ప్లేయర్ రెండు చెంపలు వాయించాడు. ఇవి అందరిని విస్మయానికి గురి చేశాయి. తాజాగా ఓ ప్లేయర్ కండోమ్ వాడి ఏకంగా మెడల్ గెలిచిందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

Tokyo Olympics Condom : వావ్… కండోమ్ వాడింది, మెడల్ గెలిచింది

Tokyo Olympics Condom

Tokyo Olympics Condom : టోక్యో ఒలింపిక్స్ లో ఎన్నో ఇంట్రస్టింగ్ ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నడూ చూడనివి, ఎప్పుడూ విననవి చోటు చేసుకుంటున్నాయి. ఓ కోచ్ తన ప్లేయర్ కి లైవ్ లో మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. మరో కోచ్ తన ప్లేయర్ రెండు చెంపలు వాయించాడు. ఇవి అందరిని విస్మయానికి గురి చేశాయి. తాజాగా ఓ ప్లేయర్ కండోమ్ వాడి ఏకంగా మెడల్ గెలిచిందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(27) కండోమ్ వాడి బ్రాంజ్(కాంస్యం) మెడల్ గెలిచింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది.

జెస్సికా ఫాక్స్ తను ఎదుర్కొన్న సమస్యకు కండోమ్ సాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని తన కోచ్ పిండి పదార్ధం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. అలా పడవకు రిపేర్ చేసి రేస్ ముగించింది. ఈ సీక్రెట్ ను తాజాగా సోషల్ మీడియాలో బహిర్గతం చేసింది జెస్సికా. దీంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

పడవకు ఏ విధంగా కండోమ్ తొడిగింది, రిపేరీ చేసింది వివరిస్తూ జెస్సికా ఫాక్స్ ఓ వీడియో కూడా తీసింది. ఆ వీడియోని ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. కండోమ్.. కయాక్ రిపేరీకి కూడా వాడొచ్చని మీకు తెలుసా? అని క్యాప్షన్ పెట్టింది. ఫైనల్ పోటీలో జెస్సికా అందరికన్నా ముందుగానే రేస్ ఫినిష్ చేసింది. ఆమెకి గోల్డ్ మెడల్ దక్కాలింది. అయితే పలు పెనాల్టీల కారణంగా ఆమె గోల్డ్ మెడల్ కోల్పోయింది. కాంస్యంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.