Man 78 times Covid positive: వయస్సు 56..78 సార్లు పాజిటివ్‌..14 నెలలుగా ఐసోలేషన్‌లో చికిత్స..!

లక్షణాలు లేకపోయినా 78 సార్లు పాజిటివ్‌ గా నిర్ధారణ..దీంతో సదరు బాధితుడు 14 నెలలుగా ఐసోలేషన్‌లో చికిత్స పొంతుతున్నాడు.

56 years Turkish man 78 times Covid-19 positive.:  ప్రపంచంలో చాలామందికి కోవిడ్ వస్తోంది తగ్గుతోంది. కొంతమంది ప్రాణాలే తీస్తోంది. కానీ ఓవ్యక్తి విషయంలో మాత్రం కోవిడ్ ప్రేమ చూపిస్తోందా? పగ సాధిస్తోందా? అనిపిస్తోంది. ఎందుకంటే అతనికి ఒకసారి కాదు రెండు సార్లుకాదు లేదా ఏ10,20 సార్లో కాదు ఏకంగా 78 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 78సార్లు పరీక్షలు చేయించుకంటే 78సార్లూ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.అలా 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 78 సార్లు పాజిటివ్ రావటంతో 14 నెలల నుంచి ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నాడు. పైగా అతనికి ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేకపోవటం మరో విశేషం..

లక్షణాలు లేకపోయినప్పటికీ.. కరోనా వైరస్‌ మాత్రం అతడి శరీరాన్ని వదలడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 78 సార్లు పరీక్షలు జరిపినా ఫలితం మాత్రం పాజిటివ్‌ అని తేలడం.. ఇక చేసేది లేక 14 నెలలుగా ఐసోలేషన్​లోనే ఉంటూ నరకం అనభవిస్తున్నాడు ఆ వృద్ధుడు. 2020 నవంబర్​ నుంచి ఇప్పటివరకు 78 సార్లు కరోనా టెస్టు చేయగా.. అతడికి అన్నిసార్లూ పాజిటివ్‌గానే తేలింది.

Also read : HIV Cure WithOut Medicine:మందులు వాడకుండానే HIV నుంచి కోలుకున్నవ్యక్తి..ఈరహస్యం ఛేదిస్తే బాధితులకు శుభవార్తే

టర్కీలోని ఇస్తాంబుల్ వాసి ముజఫర్​ కయాసన్ ​అనే 56 ఏళ్ల వ్యక్తికి 2020 నవంబర్​లో మొదటిసారి కరోనా సోకింది. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. లక్షణాలేవీ లేవు. కానీ టెస్టు చేస్తే మాత్రం పాజిటివ్ అని వచ్చింది. లక్షణాలు లేకపోవడంతో రెండు వారాల తర్వాత డిశ్చార్జి అయి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. కాస్త కోలుకున్నాక మళ్లీ పరీక్షలు చేయగా పాజిటివ్ అనే వచ్చింది.

అతను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని అనిపించాక మరోసారి మరోసారి అలా ఎన్నిసార్లు పరీక్షించినా పాజిటివ్ గా నిర్దారణ అవుతోంది. పరీక్ష చేసిన ప్రతిసారీ కొవిడ్ పాజిటివ్‌గానే తేలుతోంది. చక్కటి ఆహారం తీసుకుంటూనే అవసరమైన మందులు వాడుతున్నా..మళ్లీ మళ్లీ పరీక్షలు చేసినా పాజిటివ్ అనే వస్తోంది..అలా పాజిటివ్ రావటంతో గత 14 నెలల నుంచి ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు.

దీంతో అతనితో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.బాధిత వ్యక్తి ముజఫర్ లుకేమియా వ్యాధి ఉందని..అతని రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అందుకే అలా పాజిటివ్ వస్తోందని అంటున్నారు. లుకేమియా వల్ల అతని శరీరం క్షీణించిపోయి..కరోనా వంటి వైరస్​లపై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేసుకోవడం లేదని తెలిపారు.

Also read : ఎయిడ్స్ పూర్తిగా నయమైంది, ఈ అదృష్టవంతుడు ప్రపంచంలో రెండో వ్యక్తి

అందుకే అతడికి కరోనా నెగెటివ్ రావడం లేదని చెబుతున్నారు. పాజిటివ్ వస్తోంది కాబట్టి ముజఫర్‌కు కొవిడ్‌ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవటం మరో విశేషం. అయితే ఇలా ఎంతకాలం ఉండాలో తెలియక ముజఫర్​ తీవ్ర వేదనకు గురవుతున్నాడు. దయచేసి నా సమస్యను తీర్చాలని ఆవేదన వ్యక్తంచేస్తూ.. టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు