ఎయిడ్స్ పూర్తిగా నయమైంది, ఈ అదృష్టవంతుడు ప్రపంచంలో రెండో వ్యక్తి

హ్యూమన్ ఇమ్యునో వైరస్ (HIV) ఎయిడ్స్.. ఈ పేరు చెబితే చాలు అందరికి దడ. కారణం మందు లేకపోవడమే. ఎయిడ్స్ సోకితే చావాల్సిందే. మరో దారి లేదు. ఎన్నో ఏళ్లుగా

  • Edited By: veegamteam , March 11, 2020 / 10:04 AM IST
ఎయిడ్స్ పూర్తిగా నయమైంది, ఈ అదృష్టవంతుడు ప్రపంచంలో రెండో వ్యక్తి

హ్యూమన్ ఇమ్యునో వైరస్ (HIV) ఎయిడ్స్.. ఈ పేరు చెబితే చాలు అందరికి దడ. కారణం మందు లేకపోవడమే. ఎయిడ్స్ సోకితే చావాల్సిందే. మరో దారి లేదు. ఎన్నో ఏళ్లుగా

హ్యూమన్ ఇమ్యునో వైరస్ (HIV) ఎయిడ్స్.. ఈ పేరు చెబితే చాలు అందరికి దడ. కారణం మందు లేకపోవడమే. ఎయిడ్స్ సోకితే చావాల్సిందే. మరో దారి లేదు. ఎన్నో ఏళ్లుగా ఎయిడ్స్ కి మందు కనుక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సక్సెస్ కావడం లేదు. ఎయిడ్స్ సోకితే… అది మరింత పెరగకుండా చేసేందుకు మందులున్నాయే తప్ప… పూర్తిగా నయం చేసే పరిస్థితి లేదు. అందువల్ల ఎయిడ్స్ వ్యాధి సోకిన వారు… కొన్ని సంవత్సరాల తర్వాతైనా చనిపోతారు. ఎయిడ్స్ వస్తే చనిపోవడం తప్పితే బతకడం దాదాపు కష్టమే. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక వ్యక్తి ఎయిడ్స్ నుంచి బయటపడ్డాడు. 

ఎయిడ్స్ ను జయించిన యువకుడు:
తాజాగా మరో వ్యక్తి ఎయిడ్స్ వ్యాధిని జయించాడు. అతడు ఎయిడ్స్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్లు ప్రకటించారు. లండన్‌కి చెందిన ఆడమ్ క్యాస్టిల్లెజో(Adam Castillejo)… HIV సోకిన 30 నెలల తర్వాత… దాని నుంచి బయటపడ్డాడు. అప్పటివరకూ చేయించుకుంటున్న యాంటీ-రిట్రోవైరల్ థెరపీని కూడా మానేశాడు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. మందుల ద్వారా అతడికి ఎయిడ్స్ క్యూర్ కాలేదు. ప్రత్యేకమైన కణజాల ట్రీట్‌మెంట్ ద్వారా నయమైంది. ఆడమ్ కి క్యాన్సర్ ఉండటంతో… ఈ ట్రీట్‌మెంట్ చేశారు. కేన్సర్ రోగులకు మాత్రమే కణజాల ట్రీట్ మెంట్ చేస్తారు. ఆ క్రమంలో HIV నయమైందని లాన్సెట్ HIV జర్నల్ తెలిపింది. సదరు యువకుడికి ఒక దాత కణజాలాన్ని ఇచ్చాడు. ఆ దాతకు ప్రత్యేకమైన జన్యువులు ఉండటంతో వాటికి HIV నుంచి కాపాడే లక్షణం ఉందని డాక్టర్లు తెలిపారు.

ఎయిడ్స్ ను జయించిన తొలి వ్యక్తి తిమోతీ బ్రౌన్:
2011లో బెర్లిన్ కు చెందిన తిమోతీ బ్రౌన్ అనే పేషెంట్ తొలిసారిగా ఎయిడ్స్ నుంచి విముక్తి పొందాడు. అతనికి HIV సోకిన మూడున్నరేళ్ల తర్వాత… ఇలాంటి ట్రీట్‌మెంటే చేశారు. అది అతనికి కలిసొచ్చింది. తిమోతీ బ్రౌన్ కు ఎయిడ్స్ తో పాటు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ లో భాగంగా కణజాల చికిత్స చేయడంతో ఎయిడ్స్ నయమైంది. ఆ తర్వాత ఆడమ్ కి నయం చేశారు వైద్యులు. ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి ఆడమ్ సిద్దమయ్యాడు. ప్రస్తుతం అతని ఇంటర్వ్యు కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. 

క్యాన్సర్ ఉన్న వారికి మాత్రమే కణజాల ట్రీట్ మెంట్:
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎయిడ్స్ తో బాధపడుతున్నారు. ఎయిడ్స్ తో అనేకమంది చనిపోయారు. కాగా, వాళ్లందరికీ కణజాల ట్రీట్‌మెంట్ చెయ్యడం కుదరదని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే అది కాన్సర్ ఉన్నవాళ్లకే తప్ప… HIV ఉన్నవాళ్లకు చేసేది కాదని అంటున్నారు. అంతేకాదు… ప్రస్తుతం ఎయిడ్స్ నివారణకు అత్యంత పవర్‌ఫుల్ డ్రగ్స్ (మందులు) ఉన్నాయని… వాటిని వాడితే… వైరస్ బాడీలో ఉన్నా… ఎక్కువ కాలం జీవించగలరని అంటున్నారు. ఎయిడ్స్‌ని పూర్తిగా నయం చేసే ట్రీట్ మెంట్ దిశగా పరిశోధనలు, ప్రయోగాలు జరుపుతూనే ఉంటామని డాక్టర్లు తెలిపారు.

ఏడాది క్రితమే ఎయిడ్స్ నయమైంది:
నిజానికి ఆడమ్ కి ఏడాది కిందటే వైరస్ తొలగిపోయింది. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని… డాక్టర్లు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించ లేదు. తిరిగి వైరస్ లక్షణాలు కనిపిస్తాయేమోనని ఏడాదిగా ఎదురు చూశారు. అలా జరగకపోవడంతో… ఇప్పుడు అధికారిక ప్రకటన చేశారు. 2003లో ఆడమ్ కు ఎయిడ్స్ సోకింది. 2012 వరకు ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. అదే ఏడాది ఆడమ్ లో క్యాన్సర్ గుర్తించారు డాక్టర్లు. 2016 లో బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చేశారు డాక్టర్లు. మరో వ్యక్తి నుంచి సేకరించిన కణజాలం ద్వారా ప్రత్యేక చికిత్స చేశారు. దీంతో ఎయిడ్స్ నయమైంది. 

See Also | అమెరికాపై కరోనా దెబ్బ..యూవర్శిటీలకు తాళం..ఎగ్జామ్స్ రద్దు,ఆన్‌లైన్ లోనే టీచింగ్