72 years tattooed person : 73 ఏళ్ల వృద్ధుడు..అరికాళ్లు తప్ప ఒళ్లంతా పచ్చబొట్లే : టాటూల వెనుక పెద్ద చరిత్రే

72 Years tattooed Person..

72 years tattooed person with 98 percent :  జర్మనీకి చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించేసుకున్నాడు. ఎంతగా అంటే ఒంటిమీ ఎక్కడా ఖాళీ చర్మమే కనిపించనంతగా..అరికాళ్లు తప్ప ఒళ్లంతా పచ్చబొట్ట మయంగా కనిపిస్తాడీ తాత. దీంతో అతడిని సడెన్ గా చూస్తే మనిషేనా? అనే డౌట్ కూడా వస్తుంది. శరీరంపై 98 శాతం పచ్చబొట్లతో సరికొత్త రికార్డు సృష్టించాడు . అంతలా ఆయన ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకోవటానికి ఓ కారణం కూడా ఉంది.

జర్మనీకి చెందిన వోల్ఫ్‌గ్యాంగ్ కిర్ష్ అనే 72 ఏళ్ల వృద్ధుడు గత రెండు దశాబ్దాలుగా పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. అతని శరీరం అంతా పచ్చబొట్లే. అరికాళ్లు తప్పించి మొత్తం శరీరంమీద 86 పెద్దపెద్ద పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. దీంతో దేశంలో అత్యధికంగా పచ్చబొట్లు పొడిపించుకున్న వ్యక్తిగా వోల్ఫ్‌గ్యాంగ్ కిర్ష్ అధికారికంగా రికార్డుల్లోకి ఎక్కాడు.

కిర్ష్ పచ్చబొట్లు వెనుక చరిత్ర..
వోల్ఫ్‌గ్యాంగ్ కిర్ష్ పచ్చబొట్లు వెనుక ఓ కారణం కూడా ఉంది. దీని వెనుక బెర్లిన్ గోడ చరిత్ర గుర్తుకొస్తుంది. 1989లో బెర్లిన్ గోడ కూలిన తర్వాత తాను పచ్చబొట్లు పొడిపించుకోవడం మొదలుపెట్టానని తెలిపాడు.

పోస్టాఫీసు వర్కర్ గా పనిచేసిన రిటైర్ అయిన కిర్ష్ ఉత్తర జర్మనీలో పోస్టాఫీసులో పనిచేస్తున్నప్పుడు టాటూలు వేయించుకోవాలనుకున్నాడు. కానీ అది అప్పుడు సాధ్యం కాలేదు. ఆ తరువాత అతను రిటైర్ అయ్యాక..జర్మనీ తిరిగి ఏకమయ్యేంత వరకు వేచిచూడాల్సి వచ్చిందని అన్నాడు. తన గొంతు, వేళ్లు సహా శరీరం కింద 17 ఇంప్లాంట్లు కూడా ఉన్నట్టు తెలిపాడు. వీటిలో కొన్ని మేగ్నటిక్ ఇంప్లాట్లు అని చెప్పుకొచ్చాడు.

తనను తాను మేగ్నెటోగా పిలుచుకుంటా వోల్ఫ్. ముఖం, చేతులు, వీవు, మొండెం, కాళ్లు సహా శరీరంలోని ఏ భాగాన్నీ, ఏమూలను వదలకుండా పచ్చబొట్లు వేయించుకున్నాడు. అతని శరీరంలో ఒక్క అరికాళ్లు తప్ప అతడి శరీరం మొత్తం పచ్చబొట్లతో నింపేశాడు.

దీని కోసం విడతల వారిగా ఏకంగా (విడతవారీగా వేయించుకున్న సమయం) 720 గంటలు కూర్చోవాల్సి వచ్చిందని తెలిపాడు వోల్ఫ్. 46 ఏళ్ల వయసులో తొలి టాటూ వేయించుకున్నాననీ..ఆఖరికి తన కనుగుడ్లపైనా కూడా టాటూ వేయించుకున్నానని తెలిపాడు. ఈ టాటూ వ్యసనంలా మారి ఏకంగా 25 వేల యూరోలు ఖర్చు చేసేంతగా వెళ్లింది అతని పిచ్చి. ఈ టాటూలతోనే తనకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చిందనీ..తాను వీధుల్లో నడిచి వెళ్తుంటే చాలామంది తనతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటారని సంతోషంగా చెప్పుకొచ్చాడీ 72 ఏళ్ల వోల్ఫ్‌గ్యాంగ్ కిర్ష్. ఆ పచ్చబొట్లే తనకు రికార్డు కూడా తెచ్చిపెట్టాయంటున్నాడు.