ఇరాన్‌లో కరోనా మరణ మృదంగం : ఒక్క రోజే 75 మంది మృతి 

ఇరాన్‌లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది.  వైరస్ కారణంగా ఇక్కడ ఒక్క రోజే 75మంది చనిపోయారు.

  • Publish Date - March 13, 2020 / 03:12 AM IST

ఇరాన్‌లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది.  వైరస్ కారణంగా ఇక్కడ ఒక్క రోజే 75మంది చనిపోయారు.

ఇరాన్‌లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది.  వైరస్ కారణంగా ఇక్కడ ఒక్క రోజే 75మంది చనిపోయారు. మొత్తం 31 ప్రాంతాలలో కరోనా విలయతాండవం చేస్తోన్న ఇరాన్‌లో నెలక్రితం ఒక్కకేసూ నమోదు కాలేదు..ఇప్పుడు మాత్రం ఈ స్థాయిలో కరోనా విజృంభించడానికి కారణం ఏంటి ?.

కరోనా తాకిడికి ఇరాన్ అల్లాడిపోతోంది. చైనా తర్వాత అత్యంత కరోనా ప్రభావిత దేశంగా మారిన ఇరాన్‌లో మృత్యుఘంటికలు ఆగడం లేదు. తమ దేశంలోని వాతావరణ పరిస్థితులే వైరస్‌ని అడ్డుకుంటాయన్నట్లుగా నిర్లక్ష్యం చేయడమే ఇప్పుడా దేశం పాలిట శాపంగా మారింది. ఫిబ్రవరి19 వరకూ కూడా ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక్కడ కోవిడ్ ప్రభావమే లేదని చెప్పిన ఇరాన్ హెల్త్ మినిస్టర్‌కే జబ్బు సోకడం ఇక్కడి నిర్లక్ష్యానికి..పరిస్థితికి అద్దం పడుతోంది..(127 దేశాలకు పాకిన కరోనా…4,973 మంది మృతి )

ఇరాన్‌లో ఇప్పుడు చైనా కంటే కోవిడ్ 19 వైరస్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అలానే మృతుల సంఖ్యా పెరిగిపోతూ వస్తోంది..గురువారం నాటికి ఇరాన్‌లో 429మంది మరణించగా..ఒక్క గురువారమే 75 మంది చనిపోయారు..మొత్తంగా పదివేల డెభ్బై ఐదు కేసులు ఇరాన్‌లో నమోదు అయ్యాయ్. కరోనా మృతులలో ఇక్కడి ఉన్నతాధికారులు..రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు..ఇదే సామాన్యజనాన్ని మరింత వణికిస్తోన్న విషయం. పైగా అసలు కరోనా టెస్టులే చేయించుకోనివారి సంఖ్య ఇక్కడ వేలల్లో ఉంది..అసలు ఫిబ్రవరి 19కి ముందే ఇరాన్లోని ఖోమ్ ఆస్పత్రికి చాలామంది పేషెంట్లు ఛాతీనొప్పితో వచ్చినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెప్తున్నారు..

రోజూ కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో..ఇరాన్‌ హాస్పటల్స్‌లో బెడ్స్ అందుబాటులో ఉండటం లేదు. అంతేకాదు ఇక్కడి డాక్టర్లకు..నర్సులకు కూడా వైరస్ సోకింది.. పైగా అవసరమైన మందులకూ కొరత ఉంది.. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇరాన్ కరోనా మహమ్మారితో పోరాడుతోంది.  మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అన్ని దేశాలకు  కేంద్ర బిందువుగా ఉన్న ఇరాన్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో సమీప దేశాలు వణికిపోతున్నాయి. భారత్ సహా చాలా దేశాలకు ఇరాన్ నుంచే కరోనా వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి విమాన సేవలను పూర్తిగా నిలిపివేశారు.

మరోవైపు ఇరాక్‌లో మాత్రం కాస్త భిన్నమైన  పరిస్థితి ఉంది ..మొత్తంగా కేసులు సంఖ్య తక్కువే అయినా 71మంది కరోనా బారిన పడ్డారు. వారిలో ఎనిమిది చనిపోయారు. ఇరాన్‌తో పోల్చుకుంటే వైరస్ విషయంలో వెంటనే స్పందించడమే ఇరాక్‌ని తాత్కాలికంగా అయినా పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందనాలి.