మిస్సైల్ దాడుల్లో 80మంది అమెరికన్ ఉగ్రవాదులు హతం : ఇరాన్ మీడియా
ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన

ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన
ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన వెంటనే…. ప్రతీకార చర్యలను ప్రారంభించింది. బుధవారం(జనవరి 8,2020) ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్‌ను ప్రయోగించింది. అమెరికా సైనిక, సంకీర్ణ దళాలకు ఆశ్రయం ఇస్తున్న రెండు ఇరాకీ సైనిక స్థావరాలైన అల్ అసాద్, ఇర్బిల్‌పై 12 క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా వెంటనే తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలపైనా దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
ఈ దాడులపై స్పందించిన అమెరికా.. ఆల్ ఈజ్ వెల్ అని స్టేట్ మెంట్ మిచ్చింది. కాగా, ఇరాన్ మీడియా మాత్రం.. ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడుల్లో 80మంది అమెరికన్ టెర్రరిస్టులు హతమయ్యారని వార్తలు ప్రసారం చేసింది. అమెరికా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పింది. అమెరికా విమానాలకు, ఆర్మీకి చెందిన సామాగ్రికి తీవ్రమైన నష్టం జరిగినట్లు కథనాలు ఇచ్చింది.
ఇది ఇలా ఉంటే.. ఇరాన్ మిస్సైల్ దాడులపై స్పదించిన ట్రంప్.. ఆల్ ఈజ్ వెల్ అన్నారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన మిలటరీ తమ దగ్గర ఉందని గుర్తు చేశారు. ఇలాంటి దాడులు యుద్ధాలకు దారితీస్తాయని ట్రంప్ హెచ్చరించారు. “ఆల్ ఈజ్ వెల్. ఇరాక్ లోని మా సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్స్ దాడి చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి అంచనా వేస్తున్నాము. ఇప్పటివరకు అంతా బాగుంది. ప్రపంచంలోనే శక్తిమంతమైన మిలటరీ మా దగ్గరుంది. రేపు(జనవరి 9,2020) ఉదయం దీనిపై ఓ ప్రకటన చేస్తాను” అని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. రేపు ట్రంప్ ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ దాడులపై ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.