Lillian Droniak
Lillian Droniak : 93 ఏళ్ల బామ్మ తన ప్రేమ జీవితానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు సదరు బామ్మ ఎంత మందితో డేటింగ్ చేసింది. వారిలో ఎవరు ఆమెకు భాయ్‌ప్రెండ్స్‌గా మారారు. మిగిలిన వారితో ఎలా విడిపోయింది అన్న విషయాలను వివరించింది. ఆ బామ్మ పేరు లిలియన్ డ్రోనియాక్. 93 ఏళ్ల ఆమె సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్.
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో నివసించే ఆమెను ముద్దుగా డ్రోనియాక్ దాదీ అని నెటిజన్లు పిలుచుకుంటుంటారు. 2012 నుంచి తన మనవడితో కలిసి లిలియన్ డ్రోనియాక్ యూట్యూబ్‌లో వీడియోలో చేయడం ప్రారంభించింది. టిక్‌టాక్‌తో ఆమెకు చాలా పేరొచ్చింది. టిక్‌టాక్‌లో ఆమెకు 12.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. భర్త 2000 సంవత్సరంలో మరణించాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐదుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. భర్త చనిపోయినప్పటి నుంచి అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది. ఆమె ఎవ్వరితోనూ డేటింగ్ చేయలేదు.
డేటింగ్‌కు సిద్ధం అంటూ..
అయితే.. గత సంవత్సరం మాత్రం తాను డేటింగ్‌కు సిద్ధం అంటూ ఓ వీడియో పోస్ట్ చేయగా అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోని 71 మిలియన్లకు పైగా మంది వీక్షించారు. ఆ వీడియోలో తాను ఫ్రీగా పుడ్ తినడానికి వెళ్తానని తనతో పాటు పర్సు కూడా తీసుకువెళ్లనని చెప్పింది. కాగా.. 2023 సంవత్సరంలో తాను ఎంత మందితో డేటింగ్ చేశాను అనే విషయాలను వెల్లడిస్తూ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేసింది.
2023లో ఆమె ఐదుగురు పురుషులతో డేటింగ్ చేసినట్లు చెప్పింది. ఒకరిని అంత్యక్రియల్లో, ఇంకొకరిని ఇన్‌స్టాగ్రామ్‌లో, మరొకరిని బార్‌లో, ఇద్దరిని గేమింగ్ యాప్‌లో కలిసినట్లు తెలిపింది. ఈ ఐదుగురిలో ఎంత మందిని ముద్దు పెట్టుకున్నావ్ అనే ప్రశ్న ఎదురుకాగా.. అది చెబితే అందరూ ఆశ్చర్యపోతారంది. అందరిని ముద్దు పెట్టుకున్నట్లు చెప్పింది. ఇప్పుడు వారితో అనుబంధం ఎలా ఉంది అని అడుగగా.. వారిలో ఒకరు చనిపోయారు అని, ఒకరు నిజాయితీ పరుడు కాకపోవడంతో విడిచిపెట్టినట్లు చెప్పింది. మోసం చేయడంతో ఇద్దరితో మాట్లాడడం మానేశానని, ఇంకొకరు తనకు బాయ్‌ఫ్రెండ్‌గా మారినట్లు చెబుతూ సిగ్గు పడిపోయింది.
అతడు తన జీవితం గురించి అందరితో పంచుకోవడానికి ఇష్టపడడని, అతడు కోరుకుంటే తప్ప అతడి పేరు బయటి ప్రపంచానికి వెల్లడించనని తెలిపింది. ఇతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసినట్లు చెప్పింది. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంది. ఈ భామ పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారగా.. టిక్‌టాక్‌లో 12.8 మిలియన్ల, ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకు పైగా మంది చూశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. అమ్మమ్మా.. మీ డేటింగ్ జీవితం నా 31 సంవత్సరాల కంటే చాలా ఉత్తేజకరమైనది ఒకరు వ్యాఖ్యానించగా.. నువ్వు చాలా గ్రేట్ బామ్మా అంటూ ఇంకొకరు అన్నారు.
Dogs : కొత్త చట్టం.. కుక్కల్ని చంపినా, మాంసాన్ని అమ్మినా.. మూడేళ్ల జైలు..!