Dogs : కొత్త చ‌ట్టం.. కుక్క‌ల్ని చంపినా, మాంసాన్ని అమ్మినా.. మూడేళ్ల జైలు..!

మ‌నం కోళ్లు, మేక‌, గొర్రె మాంసం ఎలా తింటామో ద‌క్షిణ కొరియా వాళ్లు కుక్క మాంసంను అంత ఇష్టంగా తింటారు.

Dogs : కొత్త చ‌ట్టం.. కుక్క‌ల్ని చంపినా, మాంసాన్ని అమ్మినా.. మూడేళ్ల జైలు..!

South Korea passes law banning dog meat trade

Updated On : January 9, 2024 / 3:21 PM IST

Dog Meat : మ‌నం కోళ్లు, మేక‌, గొర్రె మాంసం ఎలా తింటామో ద‌క్షిణ కొరియా వాళ్లు కుక్క మాంసంను అంత ఇష్టంగా తింటారు. ఎన్నో శ‌తాబ్దాల నుంచి ద‌క్షిణ‌కొరియాలో కుక్క మాంసం వినియోగంలో ఉంది. అయితే.. తాజాగా ఆ దేశ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కుక్క మాంసం వినియోగాన్ని నిషేదిస్తూ ఆ దేశ పార్ల‌మెంట్ కొత్త చ‌ట్టాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో 208-0 ఓట్ల తేడాతో మంగ‌ళ‌వారం ఆమోదం ల‌భించింది. ఈ బిల్లుపై అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్ సంత‌కం చేయ‌నున్నారు.

ఈ బిల్లు ప్ర‌కారం.. కుక్క‌ల్ని చంప‌డం, బ్రీడింగ్ చేయ‌డం, ట్రేడింగ్‌, అమ్మ‌కాలపై 2027 నాటికి పూర్తిగా నిషేధం విధిస్తారు. ఆ త‌రువాత‌ ఎవ‌రైనా కుక్క మాంసాన్ని వినియోగిస్తే.. వాళ్ల‌కు రెండు నుంచి మూడేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష ప‌డ‌నుంది. అయితే.. కుక్క మాంసం తిన్నందుకు మాత్రం జరిమానాలు విధించ‌రు. కాగా.. ఈ బిల్లు పై ప‌లువురు రైతులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

Golden Globes Red Carpet : అయ్యో పాపం.. అవార్డు ఫంక్షన్‌కి వెళ్తే డైమండ్ పోయింది.. దొరికితే ఇవ్వమంటూ రిపోర్టర్ రిక్వెస్టు

ఈ కొత్త చ‌ట్టం మూడేళ్ల‌లో అమల్లోకి రానుంది. ఈ లోపు కుక్క మాంసం పెంపకందారులు, రెస్టారెంట్ య‌జ‌మానులు ప్ర‌త్యామ్నాయ వ‌న‌రుల‌ను అన్వేషించుకోవాల‌ని సూచించింది. వీరికి ప్ర‌భుత్వం పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని హామీ ఇచ్చింది. కొత్త చ‌ట్టం కార‌ణంగా వీరి వ్యాపారాలు మూత ప‌డ‌నుండ‌డంతో.. ప‌రిహారంపై ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దక్షిణ కొరియాలో 2023లో దాదాపు 1,600 కుక్క మాంసం రెస్టారెంట్లు, 1,150 కుక్కల ఫారమ్‌లు ఉన్నాయి.

నిషేదం అవ‌స‌రం..
జంతు హక్కులను ప్రోత్సహించేందుకు ఈ నిషేధం అవసరమని 22 ఏళ్ల విద్యార్థి లీ చై-యోన్ తెలిపారు. ప్ర‌స్తుతం ఎక్కువ మంది పెంపుడు జంతువును క‌లిగి ఉన్నార‌ని చెప్పారు. కుక్క‌లు సైతం కుటుంబంలో ఓ వ్య‌క్తిగా ఉంటున్నాయ‌ని, వాటిని తిన‌డం మంచిది కాద‌న్నారు.

Plane Door Blows Out : 16 వేల అడుగుల ఎత్తులో ఉండ‌గా.. ఊడిన విమానం డోర్‌.. 171 మంది ప్ర‌యాణికులు.. భ‌యాన‌క అనుభ‌వం

1980ల నాటి గత ప్రభుత్వాలు కుక్క మాంసాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చాయి. అయితే.. పురోగతి సాధించలేకపోయాయి. ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ జంతు ప్రేమికులు. ఈ జంటకు ఆరు కుక్కలు ఉన్నాయి. కిమ్ కియోన్ హీ కుక్కలను తినే పద్ధతికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ఇప్ప‌టికే పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.