Golden Globes Red Carpet : అయ్యో పాపం.. అవార్డు ఫంక్షన్‌కి వెళ్తే డైమండ్ పోయింది.. దొరికితే ఇవ్వమంటూ రిపోర్టర్ రిక్వెస్టు
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో ఫోటోలకు ఫోజులిస్తూ ఓ రిపోర్టర్ ఉంగరానికి ఉన్న డైమండ్ పోగొట్టుకుంది. పాపం కార్పెట్ అంతా వెతికినా కనిపించలేదు.. చివరికి ఏం చేసింది? అంటే..

Golden Globes Red Carpet
Golden Globes Red Carpet : 81 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియాలోని బేవరీ హిల్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వేడుకలో రెడ్ కార్పెట్‌పై 4 క్యారెట్ల డైమండ్ పోగొట్టుకున్నట్లు ఒక రిపోర్టర్ వీడియో పోస్టు చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
12th Fail : 12th ఫెయిల్ సినిమాపై IAS ఆఫీసర్ ట్వీట్.. ఇది మీ సక్సెస్ కాదు..
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఫంక్షన్‌లో రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు ఫోజులు ఇస్తూ కెల్టీ నైట్ అనే న్యూస్ రిపోర్టర్ తన 4 క్యారెట్ల డైమండ్ రింగ్‌ను పోగొట్టుకున్నారట. ఈ విషయం స్వయంగా ఆమె వీడియో ద్వారా వెల్లడించారు. ఆమె లైవ్‌లో ఉన్నప్పుడు తన ఉంగరంలోని డైమండ్ కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. వెంటనే తన ఉంగరాన్ని చూపిస్తూ తప్పిపోయిన డైమండ్ కనుగొనడంలో సాయం చేయమని సెలబ్రిటీలను కోరుతూ వీడియో పోస్టు చేసారు.
Nupur Shikhare : పెళ్లిలో పరుగు తీయడం వెనుక.. నూపుర్ శిఖరే ఎమోషనల్ రీజన్ తెలుసా?
‘అందరికీ హాయ్.. గోల్డెన్ గ్లోబ్ ఎమర్జెన్సీ.. మీరు సెలబ్రిటీ అయితే .. రెడ్ కార్పెట్‌పై 4 క్యారెట్ల డైమండ్ కనిపిస్తే దయచేసి దానిని కెల్టీ నైట్‌కి తిరిగి ఇవ్వండి.. అది పోయింది.. ఇది నిజం’ అంటూ కెల్టీ నైట్ వీడియోలో రిక్వెస్ట్ చేయడం కనిపించింది. ‘మిస్సింగ్ డైమండ్ @#గోల్డెన్ గ్లోబ్స్’ అనే శీర్షికతో దీనిని పోస్ట్ చేసారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు ఫోజులిస్తుండగా వజ్రం పోయినట్లుగా వెల్లడించారు. మేకప్ పూర్తి చేసినప్పుడు తన చేతికి వజ్రం ఉందని.. ఫోటోలు తీస్తున్నప్పుడు అది పోయిందని పేర్కొన్నారు. ఆమె రెడ్ కార్పెట్‌పై వజ్రం వెతుకుతున్నట్లు చూపించే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూసి నెటిజన్లు స్పందించారు. డైమండ్ దొరకాలని ఆకాంక్షించారు.
View this post on Instagram