12th Fail : 12th ఫెయిల్ సినిమాపై IAS ఆఫీసర్ ట్వీట్.. ఇది మీ సక్సెస్ కాదు..

12th ఫెయిల్ సినిమాపై ప్రముఖ IAS ఆఫీసర్ ట్వీట్. ఇది మీ సక్సెస్ కాదంటూ..

12th Fail : 12th ఫెయిల్ సినిమాపై IAS ఆఫీసర్ ట్వీట్.. ఇది మీ సక్సెస్ కాదు..

Vikrant Massey reaction about IAS officer tweet on 12th Fail movie actor

Updated On : January 8, 2024 / 6:35 PM IST

12th Fail : బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజైన ’12th ఫెయిల్’ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గుండెని హత్తుకుంటుంది. ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలుపడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అనేది.. ఒక బుక్ గా 2019లో అనురాగ్ పాఠక్ రాశారు. ఆ బుక్ ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేమ్ ‘విక్రాంత్ మాస్సే’.. మనోజ్ కుమార్ శర్మ పాత్రని పోషించారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌ లో హీరో విక్రాంత్ మాస్సే తన చివరి UPSC ప్రయత్నంలో విజయం సాధిస్తాడు. ఆ విషయాన్ని తన స్నేహితుడు అందరికి తెలియజేస్తూ ఎమోషనల్ అవుతాడు. ఇక ఈ సన్నివేశం గురించి ప్రముఖ IAS ఆఫీసర్ ‘అవనీష్ శరణ్’ ప్రత్యేక ట్వీట్ చేశారు.

Also read : Dil Raju : తప్పు వార్తలు రాస్తే.. వెబ్ సైట్ల తాటతీస్తా.. చిరు కామెంట్స్ గురించి దిల్ రాజు..

సినిమా యూనిట్ ని ఉద్దేశిస్తూ అవనీష్ శరణ్ ఇలా ట్వీట్ చేశారు.. “ఇది కేవలం మీ సక్సెస్ మాత్రమే కాదు. అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, UPSC పరీక్షలో హాజరయ్యేందుకు ధైర్యాన్ని కూడగట్టుకున్న వారందరి పోరాటాల ఫలితం” అంటూ పేర్కొన్నారు. అలాగే ఆ క్లైమాక్స్ సన్నివేశాన్ని కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ కి హీరోగా నటించిన విక్రాంత్ మాస్సే రెస్పాండ్ అయ్యారు.

అవనీష్ శరణ్ ట్వీట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. రెండు ఎమోజిలతో విక్రాంత్ మాస్సే కామెంట్ చేశారు. ఇక దీనికి అవనీష్ శరణ్ రియాక్ట్ అవుతూ.. “అమేజింగ్ వర్క్ బ్రదర్” అంటూ అభినందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ మూవీ కలెక్షన్ విషయానికి వస్తే.. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 66 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.