China 26 Storey Pig Apartment : చైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్టుమెంట్.. ప్రపంచంలోనే అతిపెద్ద భవనం

చైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్టుమెంట్ ను నర్మించారు. ఇటీవలే బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చింది. అయితే, పందుల పెంపకానికి ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది.

26-storey pig apartment

China 26 Storey Pig Apartment : చైనాలో పందుల కోసం 26 అంతస్తుల అపార్టుమెంట్ ను నర్మించారు. ఇటీవలే బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చింది. అయితే, పందుల పెంపకానికి ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది. పందుల పెంపకం కోసం హుబీ ప్రావిన్స్‌లోని ఎజౌ పట్టణ శివార్లలో ఈ భారీ భవనాన్ని నిర్మించారు.

పందుల పెంపకం కోసం నిర్మించిన భవనాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద భవనంగా దీనికి గుర్తింపు ఉంది. చైనాలో ప్రధాన మాంసాహారమైన పోర్క్‌ ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో పందులను పెంచుతున్నారు. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టి పెట్టిన చైనా ప్రభుత్వం.. ఇలా భారీ భవనాల్లో ఫార్మింగ్‌కు అనుమతించింది.

Chinese Protest: మాకు స్వేచ్ఛకావాలి.. జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చిన చైనా ప్రజలు

మొదట రెండు, మూడు అంతస్తుల భవనాలతో మొదలైన పందుల ఫార్మింగ్‌ ఇప్పుడు 26 అంతస్తులకు చేరింది. ఈ భవనాల్లో పందులకు యంత్రాలే ఆహారాన్ని సరఫరా చేస్తాయి. గాలి శుద్ధీకరణకు, పందులకు ఇన్‌ఫెక్షన్స్‌ సోకకుండా అధునాతన పద్ధతులను పాటిస్తున్నారు. పందుల వ్యర్థాలతో బయోగ్యాస్‌, విద్యుత్‌ ఉత్పత్తి లాంటివి కూడా చేస్తున్నారు.

ఈ 26 అంతస్తుల అపార్ట్ మెంట్ లో నెలకు 54 వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నుల పంది మాంసం ఉత్పత్తి జరుగుతుంది. ఏడాదికి 12 లక్షల పందులను పెంచి, మాంసం తీయడమే లక్ష్యంగా 8 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం 6.5 లక్షల పందులను అక్కడ పెంచుతున్నారు.

Strange Video: వీడిన చైనా గొర్రెల మిస్టరీ.. గొర్రెలు అలా గుండ్రంగా ఎందుకు తిరిగాయంటే?

గతంలో యూరప్‌లోనూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టినా వివిధ కారణాలతో వాటిలో చాలా భవనాలు మూతపడ్డాయి. ఉన్నవాటిలోనూ మూడంతస్తులకు మించి లేవు. అయితే ఇలా జనావాసాల మధ్య ఇంత భారీ స్థాయిలో పందుల పెంపకం చేపట్టడం వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.