Chinese Protest: మాకు స్వేచ్ఛకావాలి.. జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చిన చైనా ప్రజలు

షాంఘైలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నాకు పీసీఆర్ పరీక్ష వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి అనే నినాదాలు చేశారు. జిన్ జియాంగ్‌లో కూడా లాక్ డౌన్ ను ముగించాలని ఉరుంకి రోడ్డ లోని ప్రజలు డిమాండ్ చేశారు.

Chinese Protest: మాకు స్వేచ్ఛకావాలి.. జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చిన చైనా ప్రజలు

Chinese Protest

Updated On : November 27, 2022 / 11:53 AM IST

Chinese Protest: బీజింగ్ కఠినమైన కోవిడ్-19 విధానానికి వ్యతిరేకంగా శనివారం రాత్రి చైనాలోని షాంఘైలో నిరసనలు మిన్నంటాయి. కోవిడ్‌పై చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తూ రోడ్లపైకొచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత రెండురోజుల క్రితం ఉరుంకిలోని అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10మంది మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు.

ఈ ప్రమాదం సమయంలో జీరో కోవిడ్ విధానం అమల్లో ఉండటంతో అపార్ట్‌మెంట్ కింది భాగంలో లాక్ చేసి ఉంచారు. అపార్ట్ వద్ద కారులు పార్కింగ్ ఉండటంతో అపార్ట్ వాసులు తప్పించుకునే వీలు లేకపోయింది. దీనికితోడు ఫైరింజన్ లోనికిరావటం ఆలస్యం కావటంతో పదిమంది మృతులకు కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలియం యాంగ్ ట్విటర్ లో ఉరుంకీ రోడ్‌లో జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)కి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలుపుతున్న వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో స్థానికులు కమ్యూనిస్ట్ పార్టీని తొలగించండి.. జి జిన్‌పింగ్‌ను తొలగించండి వంటి నినాదాలు చేశారు.

షాంఘైలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నాకు పీసీఆర్ పరీక్ష వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి అనే నినాదాలు చేశారు. జిన్ జియాంగ్‌లో కూడా లాక్ డౌన్ ను ముగించాలని ఉరుంకి రోడ్డ లోని ప్రజలు డిమాండ్ చేశారు. షాంఘైలోని నిరసన ప్రదేశంలో ప్రజలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వందలాది మంది నిరసనకారులు పోలీసులను చుట్టుమట్టడంతో వారిని చెదరగొట్టిన పోలీసులు కొంత మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు.