Fire Accdient In Russia
Fire Accdient in Russia: రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని ఓ కేఫ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. మాస్కోకు ఈశాన్యంగా 300 కిలో మీటర్లు (180మైళ్లు) దూరంలో ఉన్న కోస్ట్రోమా నగరంలో కేఫ్ లో తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లేర్ గన్‌ని ఉపయోగించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని స్థానిక అధికారులు తెలిపారు.
పొలిగాన్ అని పిలువబడే కేఫ్ లో తెల్లవారుజాము సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే 15 మంది మరణించినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయని, అయితే స్వల్పగాయాలు కావటంతో వారిని ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం రాలేదని అధికారులు తెలిపారు.
Russia vs Ukraine War: యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా ..
మంటలు చెలరేగడంతో కేఫ్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఫ్లేర్ గన్ ఉపయోగించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రష్యాలోని వినోద ప్రదేశంలో పైరోటెక్నిక్‌లు ఘోరమైన అగ్నిప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదు. 2009లో పెర్మ్ నగరంలోని లేమ్ హార్స్ నైట్‌క్లబ్‌లో ఎవరో బాణాసంచా పేల్చడంతో చెలరేగిన మంటల్లో 150 మందికి పైగా మరణించారు.