China Restaurant Fire
China Restaurant Fire: చైనాలో విషాధ ఘటన చోటు చేసుకుంది. జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌చున్‌లోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో చాంగ్‌చున్ హైటెక్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ జోన్‌లో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. మధ్యాహ్నం 3గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.
Bus Accident In China: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి.. ఈ ఏడాది అతిపెద్ద ప్రమాదం ఇదే..
చైనాలో అగ్ని ప్రమాద ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఆ దేశంలో బిల్డింగ్ నిర్మాణాల్లో నిబంధనలు సడలింపు, అనుమతులులేని నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకొని భవనాల్లో నివాసముంటున్న, విధులు నిర్వహించే ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ నెల ప్రారంభంలో.. సెంట్రల్ సిటీ చాంగ్షాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ కంపెనీ చైనా టెలికాం కార్యాలయం ఉన్న భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
గత ఏడాది జూలైలో.. ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లోని గిడ్డంగి అగ్నిప్రమాదంలో 15 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. దానికి నెల రోజుల ముందు సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 18 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు.