Instagram Data Breach: ఇన్‌స్టా యూజర్లకు బిగ్ అలర్ట్.. 1.75 కోట్ల మంది డేటా లీక్? వెంటనే ఇలా చేయండి..

భారీ డేటా ఉల్లంఘన జరిగింది. దాదాపు 17.5 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యింది. సున్నితమైన వివరాలు ఇప్పుడు డార్క్ వెబ్ ఫోరమ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి.

Instagram Data Breach: ఇన్‌స్టా యూజర్లకు బిగ్ అలర్ట్.. 1.75 కోట్ల మంది డేటా లీక్? వెంటనే ఇలా చేయండి..

Instagram Data Breach Representative Image (Image Credit To Original Source)

Updated On : January 10, 2026 / 8:48 PM IST

Instagram Data Breach: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్. సుమారు 1.75 కోట్ల మంది యూజర్ల సెన్సిటివ్ డేటా లీక్ అయినట్లు సైబర్ నిపుణులు తెలిపారు. యూజర్ల పేర్లు, మెయిల్స్, ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. డేటా లీక్ వల్ల హ్యాకర్లు ఐడెంటిటీ థెఫ్ట్‌కు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా యూజర్లు తమ పాస్‌వర్డ్ మార్చుకోవాలని సూచించారు. అంతేకాదు.. ఇన్‌స్టా పేరుతో వస్తున్న ఫేక్ మెయిల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదన్నారు.

”భారీ డేటా ఉల్లంఘన జరిగింది. దాదాపు 17.5 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యింది. సున్నితమైన వివరాలు ఇప్పుడు డార్క్ వెబ్ ఫోరమ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. మాల్వేర్‌ బైట్స్‌లోని సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు మొదటగా దీన్ని గుర్తించారు. ఈ వారం ప్రారంభంలో “సోలోనిక్” అనే మారు పేరుతో పని చేస్తున్న ఒక సైబర్ నేరగాడు హ్యాకింగ్ ఫోరమ్‌లో హ్యాక్ చేసిన డేటాసెట్‌ను పోస్ట్ చేశాడు. “INSTAGRAM.COM 17M గ్లోబల్ యూజర్స్-2024 API లీక్” అనే టైటిల్ లో ఉన్న ఈ లిస్ట్ లో JSON TXT ఫైల్స్ రూపంలో ఫార్మాట్ చేయబడిన 17.5 మిలియన్ల రికార్డులు ఉన్నాయి” అని సైబర్ నిపుణులు వెల్లడించారు.

Also Read: ఫోటోలు కాల్చి సిగరెట్లు తాగుతున్న అమ్మాయిలు.. ఎందుకిలా? వీడియోలు వైరల్