Massive Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. భవనాలు నేల మట్టం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదు

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయింది.

massive earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇండోనేషియా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయింది. తనింబర్ రీజియన్ లో భూ ప్రకంపనలు సంభవించడంతో భవనాలు ఊగిపోయాయి. భూకంపం ధాటికి పలు భవనాలు నేల మట్టమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

భూకంపం ధాటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. మరోవైపు అధికారులు అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియా టువన్ ప్రాంతానికి నైరుతి దిశలో 342 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియిన్ సిస్మోలాజికల్ సెంటర్ గుర్తించింది.

Earthquake : జమ్ముకశ్మీర్ లో భూకంపం.. 10 రోజుల వ్యవధిలో మూడోసారి

ఆస్ట్రేలియా, తైమూర్ లో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు నిర్మాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు