Albrecht Dürer Art : 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం..రూ. 374 కోట్లు..!!

500 ఏళ్ల నాటి ఓ అద్భుత కళాఖండం.. ఐదేళ్ల క్రితం కేవలం రూ. 2,250కు కొలుగోలు చేస్తే..దాని ధర ఇప్పుడు రూ. 374 కోట్లుపైనే పలుకుతోంది..!!

German Artist Albrecht Dürer Painting: కళా హృదయం ఉన్నవారు పెయింటింగ్ లకు లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కొంటారు. అలా కోట్ల రూపాయలకు అమ్ముడైపోయిన పెయింటింగ్ లు ఎన్నో ఉన్నాయి. ఆర్ట్ అనేది అనంతం. దానికి హద్దుల్లేవు. ఒక్కో ఆర్టిస్టుది ఒక్కో స్టైల్. ఆ పెయింటింగ్ ని చూసే విధానాన్ని బట్టి అర్థం తెలుస్తుంది. అది కళాహృదయం ఉన్నవారికే అర్థమవుతుంది. అలా కోట్ల రూపాయలు పెట్టి పెయింటింగ్ లు కొంటారు చాలామంది. అటువంటి ఓ పెయింటింగ్ భారీ ధరకు అమ్ముడై ఆశ్చర్యపరిచింది.

Read more : ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ ధర RS. 450 కోట్లు..!!

ఐదేళ్ల క్రితం కేవలం 30 డాలర్ల (రూ. 2,250)కు కొన్న ఓ పెయింటింగ్‌ ఇప్పుడు వేల కోట్ల ధర పలుకుతోంది. ఆ పెయింటింగ్ ఇప్పుడు అమెరికాలో హౌస్ క్లియరెన్స్ సేల్‌లో కేవలం 30 డాలర్ల (రూ. 2,250)కు కొన్న ఓ పెయింటింగ్‌ ఇప్పుడు వేల కోట్ల ధర పలుకుతోంది. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా 500 ఏళ్ల నాటి ఈ అద్భుత కళాఖండం ఏకంగా 374 కోట్ల రూపాయలు పలుకుతోంది ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ అనే చిత్రకారుడు వేసిన ఈ పెయింటింగ్.

ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ జర్మన్ చిత్రకారుడు. అతను కేవలం చిత్రకారుడు మాత్రమే కాదు ప్రింట్ మేకర్, జర్మన్ పునరుజ్జీవన సిద్ధాంత కర్త. న్యూరెంబర్గ్‌లో 1471 మే 21 జన్మించిన డ్యూరర్ తన 20 ఏళ్ల వయస్సులోనే అత్యున్నత నాణ్యతతోని వూడ్‌కట్ ప్రింట్స్ తయారుచేసి జర్మనీ పునరుజ్జీవనోద్యమ సమయంలోఐరోపా అంతటా బాగా పేరు పొందాడు. ముఖ్యంగా వుడ్‌కట్ ప్రింట్‌లకు ప్రసిద్ధి చెందిన ఆల్బ్రెచ్ట్ డ్యూరర్.. రాఫెల్, గియోవన్నీ బెల్లిని, లియోనార్డో డావిన్సీ వంటి ప్రముఖ కళాకారులతో సన్నిహితంగా ఉండేవారు. ‘ఫోర్ హార్స్‌మెన్ ఆఫ్ ది అపోకలిప్స్’ అనే పెయింటింగ్‌ ఆర్ట్‌ హిస్టరీలోనే గొప్పదిగా పేరొందింది.

Read more : పెయింటింగ్ ధర రూ. 670కోట్లు

ముఖ్యంగా డ్యూరర్ వేసిన ‘ఒక తల్లి, బిడ్డలను పసుపు నారపై వేసిన ఆర్ట్‌వర్క్.. ఆర్ట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోనోగ్రామ్‌లలో ఒకటిగా కీర్తించబడుతోంది. మొత్తం మోనోగ్రామ్ డ్రాయింగ్‌ను ఒకేరకమైన సిరాతో వేయబడిందీ పెయింటింగ్. కనీసం 200 షీట్‌లపై వాటర్‌మార్క్ కనిపించే కాగితంపై ఈ పెయింటింగ్‌ వేశాడా జర్మన్‌ చిత్రకారుడు. ఈ అరుదైన కళాఖండాన్ని ఇప్పుడు లండన్‌లోని ఆగ్‌న్యూస్‌ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. ఈ చిత్రాన్ని అగ్‌న్యూస్‌ గ్యాలరీ విక్రయించాలని యోచిస్తోంది. అయితే స్థిరమైన ధర ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర 374 కోట్ల 33 లక్షలు పలకవచ్చని నిపుణుల అంచనా.

 

ట్రెండింగ్ వార్తలు