ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ ధర RS. 450 కోట్లు..!!

ప్రపంచంలోనే అతి పెద్ద పెయింటింగ్ వేలం వేయగా అది ఏకంగా రూ.450 కోట్ల ధర పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ అని పేరొందిన ఈ పెయింటింగ్ దుబాయ్ లో వేసిన వేలంలో రూ.450 కోట్లకు అమ్ముడైపోయింది. ప్రముఖ బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ దుబాయ్ వేలంలో ఏకంగా 62 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ. 450కోట్లు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ ధర RS. 450 కోట్లు..!!

Worlds Largest Painting Sells For 450 Crore (1)

worlds largest painting sells for Rs. 450 crore : ప్రపంచ వ్యాప్తంగా పెయింటింగ్ లకు ఎంతో విలువ ఉంటుంది. కోట్ల రేట్లు పలుకుతుంటాయి కొన్ని పెయింటింగులు. వాటిలో అర్థం పరమార్థం కళాకారులకు మాత్రమే తెలుస్తాయి. ఎంతోమంది పెయింటింగులకు స్టేటస్ కోసం సేకరిస్తుంటారు. దీని కోసం కోట్లు కూడా లెక్క చేయరు.

2

అటువంటి ఓ అరుదైన..అద్భుతమైన పెయింటింగ్ వేలం వేయగా అది ఏకంగా రూ.450 కోట్ల ధర పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ అని పేరొందిన ఈ పెయింటింగ్ దుబాయ్ లో వేసిన వేలంలో రూ.450 కోట్లకు అమ్ముడైపోయింది.

6

 

4

ప్రముఖ బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ దుబాయ్ వేలంలో ఏకంగా 62 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ. 450కోట్లు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ‘ద జర్నీ ఆఫ్ హుమానిటీ’ పేరిట రూపొందించిన ఈ పెయింటింగ్‌ను గీసేందుకు 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్ వినియోగించారు ఆర్టిస్ట్ జాఫ్రీ.

9

దుబాయ్‌లోని అట్లాంటీస్ హోటల్‌లో రోజుకు 20 గంటల పాటు సుమారు ఏడు నెలలు కష్టపడి ఈ పెయింటింగ్‌ను పూర్తి చేశారు జాఫ్రి. కాగా..కరోనా కాలం ఎంతోమంది ఎన్నో వింత వింత రికార్డులు క్రియేట్ చేశారు. దీంట్లో భాగంగానే కరోనా కాలంలో ఆర్టిస్ట్ జాఫ్రి కూడా తన టైమ్ మొత్తాన్ని ఈ భారీ పెయింటింగ్ వేయటానికే ఉపయోగించారు. మొత్తం 70 ముక్కలుగా ఈ పెయింటింగ్ రూపొందింది.

8

ఈ అతి పెద్ద పెయింటింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా గిన్నీస్ బుక్‌కెక్కింది. దీనికి సంబంధించి ఆర్టిస్ట్ జాఫ్రికి గిన్నీస్ రికార్డు నిర్వాహకులు అధికారికంగా దృవీకరించారు. రికార్డుకు సంబందించి పత్రాన్ని కూడా పంపించారు. ఈ పెయింటింగ్‌ను దుబాయ్ వేలంలో ఫ్రెంచ్‌కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యక్తి ఏకంగా రూ.450కోట్లకు దక్కించుకోవడం విశేషం.