worlds Most Beautiful Mummy: వందేళ్ల నుంచి శ‌వ‌పేటిక‌లో రెండేళ్ల బాలిక‌.. కొంచ‌మైనా చెక్కుచెద‌ర‌లే.. అదో మిస్ట‌రీ..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈజిప్ట్ మ‌మ్మీలతో పాటు అనేక ర‌కాల మ‌మ్మీల గురించి మ‌నం వింటూనే ఉంటాం. అయితే ఇంతవరకు చూసిన మమ్మీలన్నీ చాలా వరకు కాస్త డికంపోజ్‌ అయినట్లుగానే ఉన్నాయి.

worlds Most Beautiful Mummy: ప్ర‌పంచ వ్యాప్తంగా ఈజిప్ట్ మ‌మ్మీలతో పాటు అనేక ర‌కాల మ‌మ్మీల గురించి మ‌నం వింటూనే ఉంటాం. అయితే ఇంతవరకు చూసిన మమ్మీలన్నీ చాలా వరకు కాస్త డికంపోజ్‌ అయినట్లుగానే ఉన్నాయి. ఇప్పుడు మ‌నం చెప్పుకొనే మ‌మ్మీ మాత్రం.. ప్ర‌పంచంలోనే అంద‌మైన మమ్మీగానే కాకుండా ఓ మిస్ట‌రీగా మారింది. రెండేళ్ల బాలిక వంద సంవ‌త్స‌రాల క్రితం చ‌నిపోయింది. అయితే ఆ బాలిక శ‌రీరం శ‌వ‌పేటిక‌లో ఏమాత్రం చెక్కు చెద‌ర‌కుండా అలాగే ఉంది.

Egyptian Mummy: ఇప్పటికీ 3వేల 500ఏళ్ల నాటి ఈజిప్షియన్ మమ్మీ పళ్లు

రోసాలియా లాంబార్డో సుమారు 100 సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల వయస్సులో బాలిక మ‌ర‌ణించింది. అప్ప‌టి నుంచి ఆ చిన్నారి మృత‌దేహాన్ని మ‌మ్మీలా అత్యంత జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌ప‌ర్చారు. ప్రతి సంవత్సరం ఆమెను చూడటానికి వేలాది మంది సందర్శకులు అక్క‌డి వ‌స్తున్నారు. ఈ యువతి ప్రపంచంలోనే అత్యంత అందమైన మమ్మీ అని పేర్కొంటున్నారు. ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆమె తన రెండవ పుట్టినరోజుకు ముందు అంటే.. 2 డిసెంబర్ 1920 సంవ‌త్స‌రంలో న్యుమోనియా కేసు కారణంగా మరణించింద‌ని పేర్కొంటున్నారు. అయితే ఈ వాదనలను నిపుణులుసైతం దృవీక‌రించారు. ఆమె న్యుమోనియా స్పానిష్ ఫ్లూ వల్ల మ‌ర‌ణించి ఉండవచ్చున‌ని, 1918 స‌మ‌యంలో ఈ మహమ్మారితో అనేక మంది మ‌ర‌ణించార‌ని పేర్కొంటున్నారు.

ఇటలీలోని ఉత్తర సిసిలీలోని పలెర్మోలోని కాపుచిన్ కాటాకాంబ్స్‌లో ఆమె శరీరం భద్రపర్చారు. ఓ గాజులాంటి అద్దాల‌తో శ‌వ‌పేటిక‌లో భ‌ద్ర‌ప‌ర్చారు. అయితే వందేళ్లుగా ఆమె శ‌రీరం కొంచెమైనా చెక్కు చెద‌ర‌లేదు. కేవ‌లం మెద‌డు 50శాతం చిన్న‌దిగా మారింది. అయితే శ‌రీరం దెబ్బ‌తిన‌కుండా ఉండ‌టానికి ఏమైనా ర‌సాయ‌నాలు వాడిఉంటార‌ని నిపుణుల భావిస్తున్నారు. అయితే రోసాలియా ఒక మైన‌పు ముద్ద ప‌లువురు వాదిస్తున్నారు.

 

అయితే అక్క‌డి ప్ర‌జ‌ల‌తో పాటు టూరిస్టులు ఈ శ‌వ‌పేటిక‌లో చిన్నారిని సంద‌ర్శించి ఆశ్చ‌ర్య పోతున్నారు. జీవించి ఉన్నవారు చనిపోయిన వారిని కలిసే ప్రదేశంగా పరిగణించబడుతున్న కపుచిన్ కాటాకాంబ్స్‌లో దాదాపు 8,000 శవాలు, దాదాపు 1,284 మమ్మీలు ఉన్నాయంట‌. కొంతమంది శాస్తవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్‌ ఇల్యూషన్‌ కలిగించి ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు