Dating App: సెక్స్ వద్దనుకునేవాళ్ల కోసం స్పెషల్ డేటింగ్ యాప్
సెక్స్ ఇష్టపడని వాళ్ల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతుందట. టిండర్ లాంటి యాప్ లలో ప్రొఫైల్ లో ముందుగానే ఈ విషయాన్ని ఉంచుతున్నారట. అయితే అన్నీ యాప్ లలా కాకుండా యునైటెడ్ స్టేట్స్....

Dating App
Dating App: సెక్స్ ఇష్టపడని వాళ్ల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతుందట. టిండర్ లాంటి యాప్ లలో ప్రొఫైల్ లో ముందుగానే ఈ విషయాన్ని ఉంచుతున్నారట. అయితే అన్నీ యాప్ లలా కాకుండా యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఓ యువతి కొత్త యాప్ క్రియేట్ చేసింది. డేటింగ్ యాప్ లాంటిదే అయినా.. సెక్స్ ఇష్టపడని వాళ్ల కోసం క్రియేట్ చేసిందే ఇది.
ఈ 33ఏళ్ల సీబ్రూక్ అనే యువతి ఎప్పటి నుంచో దీనిని క్రియేట్ చేయాలనుకుంటుందట. ఈ సంయమనం అనే ప్రక్రియ క్రిస్టియన్ కాన్సెప్ట్ నుంచి వచ్చిందట. కానీ, ఇది మతానికి సంబంధించిన యాప్ కాదని.. ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వారిని కలిపే యాప్ మాత్రమేనని చెబుతున్నారు సీబ్రూక్.
ప్రస్తుతం ఈ యాప్ లో 8వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారట. దేవుడు చూపించిన మార్గంలో నడుస్తున్నానని సెక్స్ కు దూరంగా ఉండే వీడియోల లింక్స్ కూడా అందులో ఉంచుతుంది. ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వొచ్చట.
…………………………………….. : తండ్రి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే..
నెలకోసారి యూజర్లంతా జూమ్ మీటింగ్స్ కూడా అటెంట్ అవుతారు. ప్రస్తుతం ఈ ప్లాట్ ఫాంపై బీటా మోడ్ పనిచేస్తుండగా.. మరికొద్ది రోజుల్లో రియాలిటీ తో మార్కెట్లోకి రానుందన్నమాట.