Strange Incident : తండ్రి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే..

పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో తండ్రి మృతదేహంతో మూడు నెలలుగా కుమారుడు జీవిస్తున్నాడు. ఈ ఘటన కోల్‌కతాలో వెలుగులోకి వచ్చింది.

Strange Incident : తండ్రి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే..

Dead Body (1)

Updated On : November 23, 2021 / 5:07 PM IST

son living with father’s dead body : పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో తండ్రి మృతదేహంతో మూడు నెలలుగా కుమారుడు జీవిస్తున్నాడు. ఈ ఘటన కోల్‌కతాలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగ్రామ్ డే (70), కౌషిక్ డే (40) అనే ఇద్దరు తండ్రీకొడుకులు. వీరు కేపీ రాయ్ లేన్‌లో నివాసముంటున్నారు.

తండ్రి సంగ్రామ్ డే మూడు నెలల క్రితం మృతి చెందారు. అయితే కుమారుడు కౌషిక్ డే..తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు. అదే ఇంట్లో తండ్రి మృతదేహంతో కుమారుడు మూడు నెలలుగా జీవిస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

MLC Election Nominations : తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కౌషిక్ మానసిక పరిస్థితి బాగలేదని తెలిపారు. సంగ్రామ్‌ డే మృతికి గల కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.