Taliban in Afghanistan: తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘాన్‌లో మహిళా పోస్టర్లకు వైట్ కలర్

అఫ్ఘనిస్థాన్ ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేసిన తాలిబాన్లు రోడ్లపై కనిపిస్తున్న మహిళా పోస్టర్లకు వైట్ పెయింట్ వేయడం మొదలుపెట్టారు.

Taliban Afghan Women

Taliban in Afghanistan: ఆఫ్ఘాన్ లో తాలిబాన్ జెండా ఎగిరింది. ఆగష్టు 15న ఆదివారం నుంచి పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంది అఫ్ఘనిస్థాన్. ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేసిన తాలిబాన్లు రోడ్లపై కనిపిస్తున్న మహిళా పోస్టర్లకు వైట్ పెయింట్ వేయడం మొదలుపెట్టారు. పలు అడ్వర్టైజ్మెంట్‌లలో వెడ్డింగ్ డ్రెస్ లలో ఉన్న మహిళల పోస్టర్లు కనిపించకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజ్ లు వైరల్ అవుతున్నాయి. బ్యూటీ సెలూన్లు, బట్టల దుకాణాల బయట ఉన్న పిక్చర్లను పెయింటింగ్ రోలర్ తో కప్పేస్తున్నారు.

తాలిబాన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘మహిళ హక్కులను గౌరవిస్తాం. దాంతో పాటు పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు హిజాబ్ తప్పనిసరిగా పాటించాలి. మా పాలసీ ప్రకారం.. హిజాబ్ పాటిస్తూనే మహిళలు చదువు, పని చేసుకోవచ్చని చెప్పారు.

మహిళలు బయటకు రావొచ్చు కానీ వారితో పాటు మగాళ్లెవరైనా సపోర్ట్ ఉండాలని చెప్పారు. కొందరు మహిళా ఉద్యోగులు జాబ్ లు చేయాలంటే పురుషులను తోడు తెచ్చుకోవాలని చెప్పారు. ఆ ప్రదేశాల్లో బుర్ఖాలు తప్పనిసరిగా ధరించాలి. 20ఏళ్ల తర్వాత మరోసారి ఆధిక్యం దక్కించుకున్న తాలిబాన్ ఆక్రమిత అఫ్ఘాన్ లో జరుగుతున్న ఘటనలను అక్కడి జర్నలిస్టు పోస్టు చేశారు.