Afghan Airstrikes : ఆఫ్ఘాన్‌లో వైమానిక దాడులు.. 23 మంది తాలిబాన్లు హ‌తం

ఆఫ్ఘనిస్తాన్‌లోని బాల్క్ ప్రావిన్స్‌లో రహస్య స్థావరాలను లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 23 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు.

Afghan Airstrikes : ఆఫ్ఘనిస్తాన్‌లోని బాల్క్ ప్రావిన్స్‌లో రహస్య స్థావరాలను లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 23 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. షోల్గారా జిల్లాలోని బోడనా ఖాలా గ్రామంలో వైమానిక దాడులు జరిగాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఈ వైమానిక దాడుల్లో 23 మంది సాయుధ ఉగ్రవాదులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు.

వైమానిక దాడుల్లో ఉగ్రవాదుల మూడు మోటారుబైక్‌లు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. పాకిస్తాన్ అధికారి గాయపడగా.. ప‌రిస్థితి విష‌మించడంతో పాక్ సైన్యం క్వెట్టాలోని ఆస్పత్రిలో చేర్చారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు. దాదాపు 20 ఏళ్ల తరువాత 2021 సెప్టెంబర్ 11 నాటికి అమెరికా దళాలు దేశం నుంచి వైదొలగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించడంతో ఆఫ్ఘనిస్తాన్ అనిశ్చితి నెలకొంది.

రిసొల్యూట్ సపోర్ట్ ట్రైనింగ్ మిషన్ నుంచి దాదాపు 10,000 మంది నాటో సైనికులు, యుఎస్ నుండి 2,500 మంది సైనికులు, జర్మనీ నుంచి 1,100 మంది, రెండు అతిపెద్ద దళాలు దేశం విడిచి వెళ్లనున్నారు. మే 1 నుంచి తాలిబాన్లు ప్రాంతీయ రాజధానులు, జిల్లాలు, స్థావరాలు, చెక్‌పోస్టులపై దాడులకు తెగబడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు