Measles: తీవ్రంగా మారుతున్న మిజిల్స్ వ్యాధి.. 24వేల కేసులు నమోదు

తాలిబాన్ల చేతుల్లో చిక్కుకున్నా అఫ్ఘాన్.. గతంలో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులతను ఎదుర్కొంటోంది.

Measles: తాలిబాన్ల చేతుల్లో చిక్కుకున్నా అఫ్ఘాన్.. గతంలో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులతను ఎదుర్కొంటోంది. రోజురోజుకు పరిస్థితులు దారుణంగా తయారవుతూ ఉండగా.. అక్కడి ప్రజలకు కనీసం రెండు పూటలా తిండి దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా చిన్నారులపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం డిసెంబర్‌ చివరివరకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అఫ్ఘాన్‌లో 32లక్షల మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో ఇబ్బంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తుంది.

అంతేకాదు.. అఫ్ఘాన్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కూడా బాగా క్షీణించడంతో.. పది లక్షల మంది చనిపోయే ప్రమాదం కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్ల ప్రభుత్వం అఫ్ఘాన్‌లో రాగానే.. విదేశీ సంస్థల నుంచి రావల్సిన నిధులు ఆగిపోయాయి. వర్షాభావంతో కరవు.. వైద్యసదుపాయాలు పూర్తిగా నిలిచిపోయాయి.

Katrina – Vicky Kaushal : త్వరలో కత్రినా కైఫ్ వివాహం..ఎవరితో ?

రాత్రివేళ ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవడం వల్ల వృద్ధులు, పిల్లలు చనిపోతూ ఉన్నారు. యువకుల్లో వ్యాధులు ఎక్కువయ్యాయి. చూపించుకునేందుకు డాక్టర్లు లేరు.. వైద్యం అందించే ఆరోగ్య కార్యకర్తలు జీతాలు లేక అందుబాటులో ఉండట్లేదు. దీంతో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర్నుంచి, ముసలివాళ్ల వరకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోషకాహార లోపం తీవ్రమై దేశంలో మీజిల్స్ వ్యాధి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 24వేల మీజిల్స్ కేసులు నమోదవ్వగా.. పోషకాహారలోపం తీవ్రమై చిన్నారుల ప్రాణాలు సైతం పోతున్నాయి. పోషకాహారలోపం తీవ్రమైతే, మీజిల్స్ మరణశిక్ష వంటిదే. అఫ్ఘాన్‌లో కొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటే పిల్లలు తీవ్రమైన ప్రమాదంలో పడిపోతారు.

ట్రెండింగ్ వార్తలు