Katrina – Vicky Kaushal : త్వరలో కత్రినా కైఫ్ వివాహం..ఎవరితో ?

బాలీవుడ్‌ లో విక్కీకౌశల్‌, కత్రినాకైఫ్‌ జంట వివాహం గురించి జోరుగా చర్చ సాగుతోంది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Katrina – Vicky Kaushal : త్వరలో కత్రినా కైఫ్ వివాహం..ఎవరితో ?

Katrina

Wedding Rumours : ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రసీమలో విక్కీకౌశల్‌, కత్రినాకైఫ్‌ జంట వివాహం గురించి జోరుగా చర్చ సాగుతోంది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరికి ఇటీవలే ఉత్తర భారత సంప్రదాయ పద్దతిలో రోఖా వేడుక నిర్వహించారని తెలిసింది. నిశ్చితార్థంతో పాటు వివాహానికి సంబంధించిన తేదీని కూడా నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ఖాన్‌ గృహంలో దీపావళి రోజున రోఖా వేడుకను నిర్వహించారని చెబుతున్నారు.

Read More : Indian Railways : రైలు ప్రయాణీకులకు శుభవార్త..స్పెషల్ రైళ్లు రద్దు, పెంచిన టికెట్ ధరలు తగ్గింపు!

వచ్చే నెల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లుగా తెలిసింది. విక్కీకౌశల్‌ ఇటీవలే ముంబయిలోని జుహూ ప్రాంతంలో విలాసవంతమైన అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారని, వివాహనంతరం ఈ జంట ఆ గృహంలోకి అడుగుపెడతారని వారి సన్నిహితులు అంటున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వివాహం జరుగుతుందని సన్నిహితులు తెలిపారు. సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ లగ్జరీ హోటల్‌లో గ్రాండ్ ఈవెంట్ జరగనుందని అంటున్నారు.

Read More : Ind – Pak : అఫ్ఘాన్‌కు భారత్ భారీ సాయం.. రవాణాకు ఒకే చెప్పిన పాకిస్తాన్

దీంతో పెళ్లికి వచ్చే అతిథుల కోసం అప్పుడే అనేక అద్దె కార్లను బుక్‌ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కత్రినా, విక్కీ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల కోసం అన్ని లగ్జరీ కార్లను బుక్‌ చేసుకున్నారని తెలుస్తోంది. జైపూర్‌ విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లడానికి మళ్లీ అటు నుంచి తిరిగి వెళ్లడానికి అప్పుడే బుకింగ్‌లు పెద్ద మొత్తంలో జరిగినట్లు ప్రచారం సాగుతోంది.