Ind – Pak : అఫ్ఘాన్‌కు భారత్ భారీ సాయం.. రవాణాకు ఒకే చెప్పిన పాకిస్తాన్

అఫ్ఘాన్‌కు ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. అయితే మొదట తమ దేశం గుండా వెళ్లేందుకు పాకిస్తాన్ అనుమతించలేదు. తాజాగా తనకు అభ్యంతరం లేదని పాక్ ప్రధాని తెలిపాడు

Ind – Pak : అఫ్ఘాన్‌కు భారత్ భారీ సాయం.. రవాణాకు ఒకే చెప్పిన పాకిస్తాన్

Ind Pak

Ind – Pak : అఫ్ఘానిస్థాన్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలు ఆకలి కేకలు అర్ధం చేసుకున్న భారత్.. ఆహార ధాన్యాలు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. 50,000 టన్నుల గోధుమలు తక్షణ సాయంగా అఫ్ఘాన్ కి ప్రకటించింది భారత్.. అయితే వీటిని పాకిస్తాన్ భూభాగం నుంచి అఫ్ఘాన్ తరలించాల్సి ఉంది. మొదట పాకిస్తాన్ ఆహార ధాన్యాల రవాణాకు అనుమతి ఇవ్వలేదు.

చదవండి : Afghan Mosque Blast : అప్ఘాన్ మసీదులో భారీ పేలుడు.. ముగ్గురు దుర్మరణం, 15 మందికి గాయాలు

తమదేశం గుండా భారత వాహనాలకు అనుమతి ఇచ్చేంది లేదని తెగేసి చెప్పింది. ఇక గురువారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అఫ్ఘాన్ సరుకులు రవాణా చేసేందుకు భారత వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. అఫ్ఘాన్ తాత్కాలిక విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి తన వైఖరి చెప్పినట్లు ఇమ్రాన్ వివరించాడు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక ఖాతా నుండి ట్వీట్‌లు కూడా వచ్చాయి.

చదవండి : Afghanistan : నలుగురు మహిళల దారుణ హత్య

అఫ్ఘాన్ ప్రజలకు మానవతా సహాయం అందించాల్సిన తక్షణ అవసరాన్ని భారతదేశం నొక్కిచెప్పిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. “ప్రస్తుత సందర్భంలో, మానవతా ప్రయోజనాల కోసం అసాధారణమైన ప్రాతిపదికన మరియు పని చేయాల్సిన పద్ధతుల ప్రకారం, పాకిస్తాన్ ద్వారా భారతదేశం అందించే గోధుమల రవాణా కోసం అఫ్ఘాన్ అభ్యర్థనను పాకిస్తాన్ అనుకూలంగా పరిగణిస్తుందని ప్రధాని తెలియజేశారు”

చదవండి : India on Afghan: అఫ్ఘాన్ పరిణామాలపై భారత్ దృష్టి..!

రాబోయే శీతాకాలాన్ని తట్టుకోవడానికి మానవతా సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించడం ద్వారా ఆఫ్ఘన్ ప్రజలకు అండగా నిలవాలనే పాకిస్థాన్ కూడా కోరుతుంటుందని ఇమ్రాన్ తెలిపాడు. గోధుమలు, బియ్యం, అత్యవసర వైద్య సామాగ్రి, ఆశ్రయ వస్తువులతో సహా అవసరమైన ఆహార పదార్థాలను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌కు అందజేస్తుందని చెప్పారు. ఇదే సమయంలో అఫ్ఘాన్ లో స్తంభించిన బ్యాంకు లావేదేవీలను సులభతరం చేయవలసిన అవసరం ఉందని వివరించాడు.