Afghanistan : నలుగురు మహిళల దారుణ హత్య

అఫ్ఘాన్‌లో ఉండలేక విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నలుగురు మహిళలను దారుణంగా హత్యచేశారు.

Afghanistan : నలుగురు మహిళల దారుణ హత్య

Afghanistan

Afghanistan :  అఫ్ఘాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నాటి నుంచి అరాచకాలు పెరిగాయి. జర్నలిస్టులు, సాధారణ ప్రజలు, గతంలో పోలీసులకు సాయం చేసిన వారిని టార్గెట్‌గా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇద్దరు వ్యక్తుల చేతిలో నలుగురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్తను అఫ్ఘాన్ తాలిబన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని తెలిపారు.

చదవండి : Taliban ban foreign currency : అఫ్ఘానిస్థాన్ లో విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు

ఈ నలుగురు మహిళలు స్నేహితులుగా తెలుస్తోంది.. ఒకే చోట పనిచేస్తున్నారని సమాచారం. ఇక వీరు మరికొందరితో కలిసి మహిళల హక్కులకోసం పోరాడుతున్నారు. అఫ్ఘాన్ లో తమకు రక్షణ లేదని భావించి విదేశాలకు వెళ్లాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఏజెంట్ సాయంతో ఆ ప్రక్రియ ప్రారంభించారు.

చదవండి : Taliban Supreme : అజ్ణాతం వీడిన అఖుండ్‌జాదా..తొలిసారి పబ్లిక్ ముందుకు తాలిబన్ సుప్రీం లీడర్

అయితే ఈ సమయంలోనే ఓ వ్యక్తి వారికి ఫోన్ చేశాడు. ఏజెంట్ గా భావించిన మహిళలు అతడితో మాటలు కలిపారు. ఇదే సమయంలో ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు.. అతడిని నమ్మిన నలుగురు మహిళలు కారులో మజార్-ఇ-షరీఫ్ నగరంలోని ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్ళగానే మరోవ్యక్తితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. వీరి హత్యపై స్పందించేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు.