Afghan Mosque Blast : అప్ఘాన్ మసీదులో భారీ పేలుడు.. ముగ్గురు దుర్మరణం, 15 మందికి గాయాలు

అప్ఘానిస్తాన్ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

Afghan Mosque Blast : అప్ఘాన్ మసీదులో భారీ పేలుడు.. ముగ్గురు దుర్మరణం, 15 మందికి గాయాలు

At Least Three Killed, Several Injured In Blast At Afghan Mosque (1)

Afghan Mosque Blast : అప్ఘానిస్తాన్ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. నంగర్‌హర్ ప్రావిన్స్‌ ట్రైలీ నగరంలోని మసీదులో ఈ పేలుడు జరిగింది. శుక్రవారం (నవంబర్ 12) ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

ఈ మేరకు అక్కడి తాలిబన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో ముగ్గురు చనిపోయినట్లుగా AFP వార్తా సంస్థ పేర్కొంది. అధికారికంగా నిర్ధారించలేదు. మసీదు లోపల నుంచే బాంబులను పేల్చివేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనలో ఇమామ్ కూడా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. మిలిటెంట్ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న ఖొరాసన్ ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ స్టేట్ అప్ఘానిస్తా‌న్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతోంది. ప్రార్థనలకు షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే మసీదులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Read Also : iPhone Users: హ్యాకర్లతో ఐఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ – గూగుల్