iPhone Users: హ్యాకర్లతో ఐఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ – గూగుల్

యాపిల్ యూజర్లు అయిన మ్యాక్, ఐఫోన్ వినియోగదారులపై పలు హ్యాకింగ్ అటాక్స్ జరుగుతున్నట్లు గమనించింది గూగుల్. దీని వెనుక ఏదో ఒక గవర్నమెంట్ సపోర్ట్ ఉందని నమ్ముతున్నామని గూగుల్...

iPhone Users: హ్యాకర్లతో ఐఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ – గూగుల్

Apple Mac Users

iPhone Users: యాపిల్ యూజర్లు అయిన మ్యాక్, ఐఫోన్ వినియోగదారులపై పలు హ్యాకింగ్ అటాక్స్ జరుగుతున్నట్లు గమనించింది గూగుల్. దీని వెనుక ఏదో ఒక గవర్నమెంట్ సపోర్ట్ ఉందని నమ్ముతున్నామని గూగుల్ స్పష్టం చేసింది. దీనిపై గూగుల్ థ్రెట్ అడ్వైజరీ గ్రూప్ (TAG) రీసెంట్ బ్లాగ్ లో పోస్ట్ చేసింది. ఆగష్టులోనే ఇవి కనుగొన్నగ్లు చెప్పింది.

కంపెనీ ఈ పొరబాట్లను ఫిక్స్ చేయడానికి టైం తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా యాపిల్ డివైజ్ లు, మ్యాక్ ఓఎస్ క్యాటలీనా, సఫారీ వినియోగదారులపైనే పడుతుందని తెలిపింది. ఈ సెక్యూరిటీ ఇష్యూ గురించి చెప్పిన తర్వాత సెప్టెంబర్ 23న యాపిల్ ఒక ప్యాచ్ విడుదల చేసిందట. సఫారీ బ్రౌజర్ లో.. దాని వెబ్ కిట్ రెండరింగ్ ఇంజిన్లో.. సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని గమనించింది.

గూగుల్ సెక్యూరిటీ టీం ప్రకారం.. వాటరింగ్ హోల్ అటాక్స్ జరిగాయి కాబట్టి.. ప్రత్యేకమైన గ్రూప్ యూజర్లు, లేదా ఇన్ఫెక్టెడ్ వెబ్ సైట్ల కారణంగా ఇలా జరిగినట్లు తెలిసింది. ఇవి దాదాపు హాంకాంగ్ చెందిన పొలిటికల్ గ్రూపువిగా కూడా అనుమానం ఉంది. కేవలం యాపిల్ డివైజ్ యూజర్లనే టార్గెట్ చేసుకుని పొలిటికల్ ప్రొసీడింగ్స్ కు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొంది.

…………………………………………. : టీఆర్ఎస్, బీజేపీని ఏకిపారేసిన భట్టి విక్రమార్క

ఒక సారి టార్గెటెడ్ యూజర్ ఆ వెబ్ సైట్లను విజిట్ చేస్తే… అటాకర్లు బ్యాక్ డోర్ లో తెలియకుండానే కొంత అరేంజ్మెంట్ చేస్తారు. అందులో స్క్రీన్ క్యాప్చర్, డౌన్ లోడ్, అప్ లోడ్ ఫైల్స్, రికార్డింగ్స్, టెర్మినల్ కమాండ్స్ వంటివి ఉండొచ్చు. దీనికి త్వరలోనే సొల్యూషన్ దొరకాలని.. అందుకే ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది గూగుల్.