Indian Railways : రైలు ప్రయాణీకులకు శుభవార్త..స్పెషల్ రైళ్లు రద్దు, పెంచిన టికెట్ ధరలు తగ్గింపు!

30శాతం అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్‌ రైళ్లను త్వరలో రద్దు చేసి తిరిగి రెగ్యులర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు..

Indian Railways : రైలు ప్రయాణీకులకు శుభవార్త..స్పెషల్ రైళ్లు రద్దు, పెంచిన టికెట్ ధరలు తగ్గింపు!

Rail

Special Trains : రైలు ప్రయాణికులను రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30శాతం అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్‌ రైళ్లను త్వరలో రద్దు చేసి తిరిగి రెగ్యులర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పెంచిన టికెట్‌ ధరలను కూడా తగ్గించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కరోనాకు ముందు నిత్యం 17వందల మెయిల్‌ ఎక్స్ ప్రెస్‌ రైళ్లు, 3వేల 500ల ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవన్నారు.

Read More : IMD : దూసుకొస్తున్న తుపాన్..ఏపీపై ఎఫెక్ట్ ?

కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో రైల్వే సేవలు నిలిచిపోయాయని… అయితే, కరోనా తీవ్రత తగ్గుతుండటంతో.. ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపించడం ప్రారంభించిందని తెలిపారు. ప్రస్తుతం మెయిల్‌ రైళ్లలో 95శాతం రైళ్లు అందుబాటులో ఉండగా.. 25 శాతం రైళ్లు ప్రత్యేక కేటగిరిలో సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు అశ్విని వైష్ణవ్‌. ఇక ప్యాసింజర్‌ రైళ్లలో వెయ్యి మాత్రమే నడుస్తున్నాయని… వాటిలోనూ 70శాతానికిపైగా ప్యాసింజర్‌ రైళ్లకు మెయిల్‌ ఎక్స్ ప్రెస్‌ హోదా ఇచ్చి.. ఆ మేరకే టికెట్‌ ధర వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఆదేశాలను రద్దు చేయబోతున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. రెండు నెలల్లో టికెట్‌ ధర తగ్గడంతోపాటు రైల్వే సేవలు మొత్తం సాధారణ స్థితికి వస్తాయని చెప్పారు.

Read More : Children Vaccine : పిల్లలకు టీకా.. తొందరపడటం ఇష్టం లేదన్న కేంద్రమంత్రి

అనవసర ప్రయాణాలను నిరుత్సాహ పరచాలన్న ఉద్ధేశ్యంతో..ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. తొలుత దూర ప్రాంతాల మధ్య..ఈ ప్రత్యేక రైళ్లు నడిపి..అనంతరం తక్కువ దూరం మధ్య కూడా నడపడాన్ని ప్రారంభించింది. పాతవాటినే ప్రత్యేక రైళ్లుగా నడుపుతూ..అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో.. కరోనా ముందున్న విధంగానే..రైళ్ల పేర్లు, నంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ…రైల్వే బోర్డు అన్ని జోనల్ కార్యలయాలకు లేఖలు రాసింది. ప్రత్యేక రైలు నెంబర్ కు మొదట సున్నా ఉంటుందని..ఇకపై అది ఉండబోదని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు.