IMD : దూసుకొస్తున్న తుపాన్..ఏపీపై ఎఫెక్ట్ ?

పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడనుందని, ఆగ్నేయ బంగళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం..అనంతరం బలపడి...తుపాన్ గా మారితే..దీనికి ‘జవాద్’ అనే పేరు పెట్టాలని యోచిస్తున్నారు.

IMD : దూసుకొస్తున్న తుపాన్..ఏపీపై ఎఫెక్ట్ ?

Ap Cyclone

AP Cyclone : ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి తగ్గముఖం పడుతూ..హమ్మయ్య అనుకుంటున్న తరుణంలో..మరో పిడుగులాంటి వార్త ఒకటి వచ్చి పడింది. మరో తుపాన్ దూసుకొస్తోందని తెలుస్తోంది. గల్ఫ్ అఫ్ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం అండమాన్ సముద్రంలోకి 2021, నవంబర్ 13వ తేదీ శనివారం ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో…దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read More :  Sania Mirza : ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయాలి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడనుందని, ఆగ్నేయ బంగళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. అనంతరం బలపడి…తుపాన్ గా మారితే..దీనికి ‘జవాద్’ అనే పేరు పెట్టాలని యోచిస్తున్నారు. తుపాన్ ప్రభావం ఏపీపై ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం మరింత బలహీన పడనుందని తెలిపారు.

Read More :  Moon Oxygen : చంద్రుడిపై లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ?

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రం 20 మీటర్లు ముందుకొచ్చింది. నెల్లూరు నగరంలో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతులో నీరు నిలిచింది. ఇళ్లలోకి నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు నెల్లూరులోని కాలంగి నది, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల రిజర్వాయర్‌కు వరద నీటి ఉధృతి భారీగా పెరిగింది. సూళ్లూరుపేట వద్ద కాలంగి నీరు హైవేపైకి చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  మరో 24 గంటలపాటు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.