Moon Oxygen : చంద్రుడిపై లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ?

ఒకటి కాదు..రెండు కాదు..లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ? దాదాపు 800 కోట్ల మందికి ఇది సరిపోతుందా ?

Moon Oxygen : చంద్రుడిపై లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ?

Moon

Moon Oxygen : ఒకటి కాదు..రెండు కాదు..లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ? దాదాపు 800 కోట్ల మందికి ఇది సరిపోతుందా ? అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే..ఈ ఆక్సిజన్ ఉన్నది చంద్రుడిపై. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మార్స్, చంద్రుడి గురించి తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తలు విపరీతంగా కృషి చేస్తున్నారు. భూమికి దగ్గరగా ఉన్న చందమామ మీదకు ఇప్పటికే మనిషి కూడా వెళ్లి వచ్చి..భూమి మీదకు విజయవంతంగా దిగాడు కూడా. అయితే..అక్కడ మనుషులు జీవిస్తే..ఎలా ఉంటుందనే దానిపై ఆలోచిస్తున్నారు. కానీ..అక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల అది సాధ్యం కాదని గుర్తించారు.

Read More : Macharla Niyojakavargam : పవన్ కి పోటీగా నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’

తాజాగా..చంద్రుడి మట్టిపై జరిపిన పరిశోధనలు బట్టి..రిగోలిథ్ లో ఒక్కో క్యూబిక్ మీటర్ లో 630 కిలోల ఆక్సిజన్ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒక మనిషి బతకాలంటే..రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్ చాలని, అంటే..630 కిలోల ఆక్సిజన్ మనిషి రెండు ఏండ్లు బతకొచ్చని వెల్లడిస్తున్నారు. రిగోలిథ్ 10 మీటర్లు ఉందనుకొంటే..దాని నుంచి 8000 కోట్ల మందికి లక్ష సంవత్సరాల వరకు సరిపడా..ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చంటున్నారు. భూమిలాగే.. చంద్రుడిలో అల్యూమినియం, ఇనుము, మెగ్నీషీయం ఆక్సైడ్, సిలికా.. వంటి ఖనిజాలు ఉంటాయని భావిస్తున్నారు. భవిష్యత్ లో అంతరిక్ష ప్రయోగాల్లో…భాగంగా..సాంకేతికతను చంద్రుడిపై వాడి ఆక్సిజన్ ఉత్పత్తి ఆశ్చర్యపోనక్కర్లేదు.