Afghanistan: 3,000 లీటర్ల మద్యాన్ని కాలువలో పారబోసిన అఫ్ఘాన్ అధికారులు..మద్యం తాగినా..అమ్మినా సహించం అంటూ వార్నింగ్
అఫ్ఘాన్ అధికారులు 3,000 లీటర్ల మద్యాన్ని కాలువలో పారబోశారు. మద్యం తాగినా..అమ్మినా సహించం అంటూ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. ముస్లింలు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.
taliban pour 3,000 litres of liquor into kabul canal : అఫ్ఘానిస్థాన్ అధికారులు 3వేల లీటర్ల మద్యాన్ని కాలువలో పారబోసారు. మద్యం అమ్మకాలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంట్లో భాగంగా అఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ బృందాలు దాదాపు 3 వేల లీటర్ల మద్యాన్ని కాబూల్‌లోని కాలువల్లో పారబోశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు విడుదల చేశారు. తాలిబన్లు మద్యం విక్రయాలతో పాటు డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
Read more : omicron in India : భారత్ లో 1700లకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు..33,000 దాటిన కోవిడ్ కేసులు
మద్యం తయారు చేయడం,అమ్మటం వంటి పనుల్ని సహించేది లేదని అప్ఘాన్ అధికారులు ప్రకటించారు. ముస్లింలు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. కాగా పారబోసిన మద్యానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముస్లింలు మద్యం తయారు చేయడం, అమ్మటం వంటివి చేయకూడదని మత్తు పదార్ధాలకు ముస్లింలు దూరంగా ఉండాలి’ అని ఇంటెలిజెన్స్ అధికారులు ట్విట్లర్ వేదికగా సూచించాలని తెలిపారు.
కానీ అఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ అధికారులు మద్యం దాడులు ఎప్పుడు చేశారు? ఎంత మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు? ఎవరినుంచి స్వాధీనం చేసుకున్నారు? అనే విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలియదు. కానీ తాలిబన్ ఇంటెలిజెన్స్ అధికారుల ప్రకటన ప్రకారంగా చూస్తే ముగ్గురు మద్యం డీలర్లను అరెస్ట్ చేశారు. కాగా..గత అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం కూడా మద్యం అమ్మడం, తాగటం వంటివాటిపై నిషేధం విధించింది. ఇస్లాం సిద్ధాంతాలను కఠినంగా అమలు చేస్తున్న తాలిబన్లు కూడా మద్యపానంపై నిషేధం కొనసాగిస్తున్నారు.
Read more : Ashok Elluswamy: ఎలన్ మస్క్’ఆటోపైలట్’ టీంలో ఫస్ట్ ఎంప్లాయ్.. భారత సంతతి ఇంజినీర్..!
కాగా తాలిబన్లు అప్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత నుంచి దేశంలో మద్యం,డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం సహా మత్తుపదార్థాల వ్యాపారులపై దాడులు ముమ్మరంగా సాగిస్తున్నారు తాలిబన్లు. అఫ్ఘాన్ ప్రమోషన్ ఆఫ్ విర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ కూడా మహిళల హక్కులను పరిమితం చేస్తూ అనేక మార్గదర్శకాలను జారీ చేసింది.
د ا.ا.ا د استخباراتو لوی ریاست ځانګړې عملیاتي قطعې د یو لړ مؤثقو کشفي معلومات پر اساس د کابل ښار کارته چهار سیمه کې درې تنه شراب پلورونکي له شاوخوا درې زره لېتره شرابو/الکولو سره یو ځای ونیول.
نیول شوي شراب له منځه یوړل شول او شراب پلورونکي عدلي او قضايي ارګانونو ته وسپارل شول. pic.twitter.com/qD7D5ZIsuL— د استخباراتو لوی ریاست-GDI (@GDI1415) January 1, 2022