omicron in India : భారత్ లో 1700లకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు..33,000 దాటిన కోవిడ్ కేసులు

భారత్ లో ఓ పక్క కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతుంటే మరో పక్క కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అలా దేశంలో ఒమిక్రాన్ కేసులు 1700లకు చేరుకున్నాయి.

omicron in India : భారత్ లో 1700లకు పెరిగిన ఒమిక్రాన్ కేసులు..33,000 దాటిన కోవిడ్ కేసులు

India Omicron Cases In India Has Risen To 1700

omicron in India : రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీటితో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. శీతాకాలం చలి పెరిగే కొద్దీ కోవిడ్ ప్రతాపం చూపిస్తోంది. ఈక్రమంలో భారతదేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 1700కు చేరుకున్నాయి. ఒమిక్రాన్ సోకినవారి కోలుకోవటం సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ సోకి 639 మంది కోలుకున్నారు.

భారత్ లో ఇప్పటివరకు 23 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఓమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర ఉండగా..ఢిల్లీ,కేరళ,గుజరాత్,తమిళనాడు,రాజస్థాన్ ,తెలంగాణ,కర్ణాటక,హర్యానాతో పాటు మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 510 కేసులు నమోదు కాగా..ఢిల్లీలో 351,కేరళ 156,గుజరాత్ 136,తమిళనాడు 121, రాజస్థాన్ 120,తెలంగాణ 67,కర్ణాటక 64,హర్యానా 63 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read more :  Kadapa News: మళ్లీ మొదటికే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల నమోదు సంఖ్యఇలా ఉండగా..సాధారణ కరోనా కేసులు దేశ వ్యాప్తంగా 33వేలు దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రోజురోజుకు కరోనా బాధితులు పెరుగుతున్న క్రమంలో దేశంలో కొత్తగా 33,750 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి. ఇందులో 1,45,582 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,42,95,407 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,81,893 మంది మరణించారు. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 10,846 మంది కరోనా నుంచి కోలుకోగా, 123 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 1,45,68,89,304 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Read more :  Maoists warn of sand mafia: ఇసుక మాఫియాకు మావోయిస్టులు లేఖ..కాంట్రాక్టర్లకు శిక్ష తప్పదంటూ హెచ్చరిక

కరోనా తన ప్రభావం చూపుతుంటే ఒమిక్రాన్‌ బాధితులు సంఖ్య కూడా పెరుగుతోంది. ఆదివారం (డిసెంబర్ 2,2022) కొత్తగా 123 ఒమిక్రాన్‌ కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 1700కు చేరింది. ఇప్పటివరకు 639 మంది కోలుకున్నారు. దేశంలోని ఒమిక్రాన్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో 510 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఢిల్లీ 351, కేరళ 156, గుజరాత్‌ 136, తమిళనాడు 121, రాజస్థాన్‌ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 చొప్పున నమోదయ్యాయి.