ఎయిర్‌హోస్టెస్‌ అంటే ఇలా ఉండాలి : దివ్యాంగురాలికి దివ్యమైన సర్వీస్ 

  • Publish Date - September 20, 2019 / 11:05 AM IST

కొన్ని వృత్తులు అంకిత భావంతో చేయాల్సి ఉంటుంది. డాక్టర్, నర్స్, ఎయిర్ హోస్టెస్ వంటి ఉద్యోగాలు అటువంటివే.వీటిలో ఎయిర్ హోస్టెస్ అంటే అందమే కాదు ఓర్పు, సహనం,సమయస్ఫూర్తి,స్నేహభావం ఇలా అన్ని కలగలిసి ఉండాలి. అలా ఉంటేనే ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు. ప్రయాణీకులు దురుసుగా ప్రవర్తించినా ఎయిర్ హోస్టెస్ లు మాత్రం నవ్వుతూనే సమాధానం చెప్పాలి. ఎటువంటి విసుగు..చిరాకువంటివి ప్రదర్శించకూడదు.ఓర్పు..సహనానికి మారుపేరుగా ఉండాలి. 

ఎయిర్ హోస్టెస్ అంటే చాలా మంది అందంగా ఉండటం..అన్ని భాషలు మాట్లాడటం మాత్రమే అనుకుంటారు. కానీ వృత్తి పట్ల అంకితభావాన్ని కనబరిచిన ఓ ఎయిర్ హోస్టెస్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.ఇంతకీ ఆమె చేసిందేమిదంటే… 

అది డెల్డా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎండీవర్‌ విమానం.బాల్టిమోర్ నుండి న్యూయార్క్ కు వెళ్తోంది. ఆ విమానంలో ఎంతోమంది ప్రయాణీస్తున్నారు.వారిలో వినికిడి లోపం ఉన్న ప్రయాణీకురాలు ఆష్లే అనే యువతి కూడా ఉంది. ఆ విమానంలో జన్నా అనే ఎయిర్ హోస్టెస్ విధులు నిర్వహిస్తోంది. విమానం టేకాఫ్ అయ్యే సమయంలోను..ల్యాండ్ అయ్యే సమయంలోనే ఎయిర్ హోస్టెస్ ప్రయాణీకులు కొన్ని సూచనలు ఇస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోమనీ వంటి విషయాలు తెలుపుతుంది. అలాగే జన్నా కూడా అదే చేసింది.
కానీ ఆ విమానంలో ప్రయాణించే ఆష్లేకు వినికిడి లోపం ఉంది. ఎయిర్ హోస్టెస్ చెప్పినవి ఏమీ ఆమెకు వినిపించవు. ఆ విషయం తెలుసుకున్న ఎయిర్‌హోస్టెస్‌ జన్నా, ఆష్లేకి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో.. ఓ పేపర్ మీద విమానంలో ఉన్న సౌకర్యాల సూచిస్తు అన్ని వివరాల గురించి రాసిచ్చింది.

ఆ పేపర్ లో ‘‘దానిలో హాయ్‌ ఆష్లే..ఈ రోజు నేను ఈ ఫ్లైట్‌ అటెండెంట్‌ని. నీవు కూర్చున్న సీటు పై భాగంలో అనగా నీ తలపైన రెండు బటన్లు ఉన్నాయి. వాటిలో పసుపుపచ్చది లైట్‌ని కంట్రోల్‌ చేస్తుంది. నీకు నాతో ఏమైనా అవసరం ఉంటే బూడిదరంగులో పెద్దగా ఉన్న బటన్‌ను ప్రెస్‌ చేస్తే నేను నీ దగ్గరకు వస్తాను. అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. నీ వెనకే ఉన్న ఎక్జిట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయ్‌. నీకు ఏ సాయం కావాలన్న దయచేసి నన్ను అడుగు. ఎటువంటి  మొహమాట పడకు’ అంటూ కాగితం మీద రాసిచ్చింది. దీన్ని ఆష్లే అది చూసి ఆష్లే ఎంతో సంతోషించింది. తన పరిస్థితి అర్థంచేసుకుని సహకరించిన జన్నాకు  థాంక్స్ చెప్పింది. తల్లి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేయటంతో ఇది సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. జన్నా మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.