మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..? : ఇరాన్ దాడులపై ట్రంప్ సంచలన ట్వీట్

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 05:13 AM IST
మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..? : ఇరాన్ దాడులపై ట్రంప్ సంచలన ట్వీట్

Updated On : January 8, 2020 / 5:13 AM IST

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన వెంటనే…. ప్రతీకార చర్యలను ప్రారంభించింది. బుధవారం(జనవరి 8,2020) ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్‌ను ప్రయోగించింది. అమెరికా సైనిక, సంకీర్ణ దళాలకు ఆశ్రయం ఇస్తున్న రెండు ఇరాకీ సైనిక స్థావరాలైన అల్ అసాద్, ఇర్బిల్‌పై 12 క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా వెంటనే తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలపైనా దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

ఇరాన్‌ క్షిపణి దాడుల్లో భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు… ఇరాన్ దాడులను పెంటగాన్ ధృవీకరించింది. దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. ఈ దాడులను ఖండించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తాజా పరిస్థితులను సమీక్షించేందుకు వైట్‌హౌస్‌లో అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్‌కు సమర్పించామన్న అమెరికా రక్షణశాఖ… సరైన సమయంలో బదులిస్తామని ప్రకటించింది. ట్రంప్‌ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఇరాన్ మిస్సైల్ దాడులపై ట్రంప్ స్పందించారు. ఆల్ ఈజ్ వెల్ అని అన్నారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన మిలటరీ తమ దగ్గర ఉందని గుర్తు చేశారు. ఇలాంటి దాడులు యుద్ధాలకు దారితీస్తాయని ట్రంప్ హెచ్చరించారు. “ఆల్ ఈజ్ వెల్. ఇరాక్ లోని మా సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్స్ దాడి చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి అంచనా వేస్తున్నాము. ఇప్పటివరకు అంతా బాగుంది. ప్రపంచంలోనే శక్తిమంతమైన మిలటరీ మా దగ్గరుంది. రేపు(జనవరి 9,2020) ఉదయం దీనిపై ఓ ప్రకటన చేస్తాను” అని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. రేపు ట్రంప్ ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ దాడులపై ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.