అలిగేటర్.. పైథాన్ ఎదురుపడ్డాయి. ఆకలితో ఉన్న అలిగేటర్.. ఇన్వాసివ్ బర్మీస్ కొండచిలువపై దాడి చేసింది. మొసలి నుంచి తప్పించుకునేందుకు కొండచిలువ కూడా గాల్లోకి అమాంతం పైకి లేచి అలిగేటర్ ప్రతిదాడి చేసింది. రెండూ ఆకలి మీద ఉన్నాయి. ఆకలి కోసం జరిగిన ఈ పోరాటంలో ఎవరికి ఎవరూ ఆహారమయ్యారో ఊహించగలరా? అలిగేటర్ విజయం సాధించింది. గెలిచిన మొసలి.. కొండచిలువను తన పదునైన దవడ పళ్లతో కరకరమని కొరికి ముక్కలు చేసి తినేసింది.
ఒళ్లు గగొరుపొడిచేలా ఉన్న ఈ ఘటన ఫ్లోరిడాలోని ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్క్ లో జరిగింది. పార్క్ అధికారులు దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అలిగేటర్ కు ఇన్వాసివ్ బర్మీస్ కొండచిలువ ఆహారమైంది. ఈ కొండచిలువ.. శక్తివంతమైన స్థానిక అమెరికన్ అలిగేటర్ కు సరిపోలేదు’ అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ వీడియోలో అలిగేటర్ నోట కరిచిన కొండచిలువలో ఎలాంటి చలనం లేదు. మొసలి శక్తివంతమైన దవడల మధ్య నలిగిపోయి చనిపోయినట్టుగా కనిపిస్తోంది.
ఇటీవల కాలంలో కొండచిలువలు అధికంగా ఎవర్ గ్లేడ్స్ పార్కులో కనిపిస్తున్నాయి. యూనిటైడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం.. పదివేలకు పైగా కొండచిలువలు పార్కులో నివసిస్తున్నట్టు వెల్లడించింది. ట్విట్టర్ ద్వార సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోకు 7వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. గత ఏడాదిలో భారీ అలిగేటర్ నోట్లో చిక్కుకున్న కొండచిలువ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.