Brave Girl: నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. ఆపదలో బాలిక సాహసం.. లిఫ్ట్ ప్రమాదం నుంచి పిల్లలను ఎలా కాపాడిందో చూడండి
Brave Girl Representative Image (Image Credit To Original Source)
- ప్రమాద సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలిక
- లిఫ్ట్ ప్రమాదం నుంచి ఇద్దరు పిల్లలను కాపాడిన అమ్మాయి
- బాలిక ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం
Brave Girl: ఏదైనా ఊహించని ప్రమాదం ఎదురైనప్పుడు భయపడిపోతుంటారు. పెద్ద వాళ్లు సైతం భయానికి గురవుతారు. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోదు. ఇక పిల్లల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇందుకు భిన్నమైన ఘటన చోటు చేసుకుంది. ఆపద సమయంలోనూ ఓ బాలిక అదరలేదు, బెదరలేదు. ధైర్య సాహసాలను ప్రదర్శించింది. తన ప్రాణం అడ్డుగా పెట్టి ఇద్దరు చిన్న పిల్లల ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీ గట్స్ కి హ్యాట్సాఫ్ అంటూ.. ఆ బాలిక ధైర్య సాహసాలను అందరూ అభినందిస్తున్నారు.
ఓ బాలిక లిఫ్ట్ ప్రమాదం నుంచి ఇద్దరు చిన్న పిల్లలను కాపాడింది. సాంకేతిక సమస్యనో మరో కారణమో కానీ.. సడెన్ గా లిఫ్ట్ తలుపులు మూసుకోపోయాయి. తన కాలు అందులో చిక్కుకుపోయింది. అయినా ఆ బాలిక ఏమాత్రం బెదరలేదు. అంతేకాదు.. తోటి పిల్లలను బయటకు తీసుకొచ్చే వరకు ధైర్యాన్ని ప్రదర్శించి పెను ప్రమాదాన్ని తప్పించింది. ఇది గమనించిన పిల్లల తల్లులు వెంటనే అక్కడికి వచ్చారు. లిఫ్ట్ తలుపులు తెరిచి వారిని రక్షించారు. ఆపద సమయంలో భయపడకుండా బాలిక ప్రదర్శించిన ధైర్య సాహసాలను అంతా మెచ్చుకుంటున్నారు.
సడెన్ గా మూసుకుపోయిన డోర్లు..
ధైర్యవంతురాలైన అమ్మాయి.. ఇద్దరు చిన్న పిల్లలు లిఫ్ట్‌లో చిక్కుకోకుండా కాపాడగలిగింది. సాయం అందే వరకు తన కాలుని అడ్డుగా పెట్టి ఉంచింది. అది 41 సెకన్ల వీడియో. ఎక్స్ లో షేర్ చేశారు. ఓ బాలిక, ఇద్దరు చిన్న పిల్లలు లిఫ్ట్ లో ఉన్నారు. బాలిక ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో సడెన్ గా లిఫ్ట్ తలుపులు మూసుకుపోవడం ప్రారంభించాయి. ఇద్దరు చిన్న పిల్లలు లోపలే ఉన్నారు. దీంతో బాలిక లిఫ్ట్ డోర్ క్లోజ్ అవకుండా తన కాలుని అడ్డుగా పెట్టింది. ఈ క్రమంలో ఆమె కాలు అందులో చిక్కుకుంది. అయినా బాలిక భయపడకుండా అలానే ఉండిపోయింది. లిఫ్ట్ డోర్లు తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.
ధైర్యంగా కాలుని అడ్డుగా పెట్టిన బాలిక..
బాలిక ధైర్యంగా తలుపుల మధ్య నిలుచుంది. అవి మూసుకోకుండా తన చేతులతో అడ్డుకుంది. ఇంతలో ఇది గమనించిన పిల్లల పేరెంట్స్ పరుగున అక్కడికి వచ్చారు. ఇద్దరు మహిళలు కలిసి తమ బలమంతా ఉపయోగించి లిఫ్ట్ డోర్లు కాస్త తెరిచారు. దాంతో బాలిక, లోపల ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు అంతా సురక్షితంగా బయటపడ్డారు. బాలిక చేసిన సాహసంతో పెను ప్రమాదమే తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో పేరెంట్స్ ఊపిరిపీల్చుకున్నారు.
అయితే లిఫ్ట్ లు వాడే విషయంలో పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పిల్లలను లిఫ్ట్ దగ్గర అలా ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారు. లిఫ్ట్ ను ఆపరేట్ చేసేందుకు బాయ్ ని ఉంచడం చాలా సేఫ్ అంటున్నారు. లేక పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలను లిఫ్ట్ దగ్గరికి పంపాలంటున్నారు. తాము లేని సమయంలో పిల్లలు అటువైపు వెళ్లకుండా చూసుకోవడమే చాలా సురక్షితం అని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగాక బాధపడేకంటే.. ప్రమాదం బారిన పడకుండా చూసుకోవడం మంచిదంటున్నారు.
A brave girl saved two young children from being trapped in an elevator, remaining calm and ensuring their safety until help arrived.
While holding the lift doors open was extremely risky, as they could have slammed shut, her quick thinking and courage prevented what could have… pic.twitter.com/WTlXyBPlJJ
— The Sentinel (@Sentinel_Assam) February 21, 2026
