అదృష్టం కలిసొస్తే మన్ను ముట్టుకున్నా బంగారం అవుతుందంటారు పెద్దలు. అంటే నిజంగా బంగారం అయిపోతుందని కాదు అన్నీ కలిసి వస్తాయని. కానీ ఓ బ్యాంకు మేనేజర్ సరదా టైమ్ పాస్ కోసమని ఓ పార్కుకు వెళ్లాడు. ఓ చోట కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తు పార్కులో అటూ ఇటూ తిరుగుతున్నాడు. దూరంగా ఏదో మెరుస్తున్నట్లుగా కనిపించింది. అదేంటో చూద్దాం అని దగ్గరకెళ్లి చూశాడు. పట్టుకుంటే అది వజ్రం అని తెలిసింది. అంతే అతను ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ఓ సాధారణ బ్యాంక్ మేనేజర్ కాస్తా కోటీశ్వరుడిగా మార్చేసిందా వజ్రం.
అమెరికాలోని నైరుతి అర్కాన్సాస్‌కి చెందిన కెవిన్ కినార్డ్ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. పార్కులకు వెళ్లటమంటే అతనికి చాలా ఇష్టం. అలా కెవిన్ చిన్నప్పటి నుంచి ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’కి వెళ్లటం అలవాటు. అలా చాలాసార్లు ఆ పార్కుకు వెళ్లేవాడు. అలా సెప్టెంబర్ 7 కెవిన్ ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’కి వెళ్లాడు.
పార్కులో అటూ ఇటూ తిరుగుతూ ఓ చోట కూర్చున్నాడు. అలా కూర్చున్న కెవిన్ మళ్లీతిరగం ప్రారంభించాడు. అలా తిరుగుతుండగా అతడికి సూర్యరశ్మి పడి తళుక్కుమంటూ ఓ రాయిలాంటిది కనిపించింది. చూడటానికి క్రిస్టల్‌లా మెరుస్తుండటంతో తీసుకుని బ్యాగులో వేసుకున్నాడు. తరువాత ఆ రాయిని పరీక్షించగా అది అరుదైన వజ్రం అని తెల్సింది. దాని బరువు 9.07 క్యారెట్లు ఉండడంతో ఒక్కసారిగా అతని పేరు మారు మ్రోగిపోయింది. అంతేకాకుండా 48 ఏళ్ల క్రితంనాటి అరుదైన వజ్రం లభించటంతో కెవిన్ ఆనందానికి అవధుల్లేవు. మార్కెట్‌లో దాని విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.
కాగా ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’ వజ్రాలకు ప్రసిద్ధి. గతంలో చాలామందికి ఈ పార్కులో వజ్రాలు లభించాయి. 37.5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ పార్క్ వజ్రాల కోసం చాలామంది వస్తుంటారు. వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
అలా గత బుధవారం నాటికి..ఈ సంవత్సరం క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ వద్ద 246 వజ్రాలు లభ్యమైనట్లుగా తేలింది. అలా లభ్యమైన వజ్రాలు మొత్తం 59.25 క్యారెట్ల బరువు ఉన్నట్లుగా తెలిసింది. సగటున..ప్రజలు రోజూ ఒకటి లేదా రెండు వజ్రాలను అక్కడ కనుగొంటుంటారు. అలా బ్యాంకు మేనేజర్ కు ఈ అరుదైన డైమండ్ లభించింది.