రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా ఏమన్నదంటే?

భారత్, భారతీయుల ప్రయోజనాలకోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా మోదీని పుతిన్ అభివర్ణించారు.

రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా ఏమన్నదంటే?

Modi and Vladimir Putin

PM Modi Russia Tour : ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. సోమవారం సాయంత్రం రష్యాలోని మాస్కోకు చేరుకున్న మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. ఆ తరువాత నోవో ఓగర్వోవోలని తన అధికారిక నివాసంలో ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రైవేటు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు అలింగనం చేసుకున్నారు. మోదీని పుతిన్ ప్రశంసలతో ముంచెత్తారు.

Also Read : Mumbai rain : ముంబైలో భారీ వర్షాలు.. 24గంటల పాటు రెడ్ అలర్ట్.. 50కిపైగా విమానాలు రద్దు

భారత్, భారతీయుల ప్రయోజనాలకోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా మోదీని పుతిన్ అభివర్ణించారు. మంగళవారం రెండోరోజు రష్యాలో మోదీ పర్యటన కొనసాగనుంది. మోదీ రష్యా పర్యటనలో అమెరికా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాధ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. రష్యాతో సంబంధాలపై మేం మా ఆందోళనను భారత్ కు ఇప్పటికే స్పష్టం చేశాం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఏం మాట్లాడతారో చూడాలి. భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు అమెరికా పేర్కొంది.

Also Read : Hemant soren : జార్ఖండ్ సీఎంకు ఝలక్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

మోదీ, పుతిన్ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోదీకి అమెరికా సూచించింది. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్ కు మోదీ స్పష్టం చేయాలని కోరుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాధ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ఒక్క భారతదేశాన్నే కాదు.. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్ని అయినా మేము ఇదే కోరతామని మిల్లర్ అన్నారు.