America Warns China Again : రష్యాకు పట్టిన గతే పడుతుంది- చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్

రష్యాకు మద్దతు కొనసాగిస్తే చైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పద్ధతి మార్చుకోకపోతే రష్యాకు పట్టిన గతే చైనాకు..(America Warns China Again)

America Warns China Again : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు నెలలుగా రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా దురాక్రమణను ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. రష్యాని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు విధించాయి. అయినా.. అనుకున్నది సాధించే వరకు తగ్గేదేలే అంటున్నారు పుతిన్. ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను అస్సలు లెక్క చేయడం లేదు పుతిన్. కాగా, రష్యా వైఖరిని సమర్థించేలా వ్యవహరిస్తున్న పలు దేశాలపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రష్యాకు పట్టిన గతే చైనాకు పడుతుందని హెచ్చరించింది.

అసలేం జరిగిందంటే.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా చైనా ఓటు వేసిందంటూ అమెరికా మండిపడుతోంది. రష్యాకు మద్దతు కొనసాగిస్తే చైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.(America Warns China Again)

UN Chief Antonio Guterres : రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఆగేనా? త్వరలో పుతిన్, జెలెన్ స్కీతో UN చీఫ్ కీలక భేటీ

రష్యాకు భౌతిక మద్దతు కొనసాగిస్తే, రష్యాపై విధించిన కఠిన ఆంక్షల్లో కొన్నింటిని చైనాకు కూడా రుచి చూపిస్తామని స్పష్టం చేసింది. రష్యా వాణిజ్యం, ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించామో చైనా ఇప్పటికే చూసిందని, పద్ధతి మార్చుకోకపోతే రష్యాకు పట్టిన గతే చైనాకు కూడా పడుతుందని ఘాటుగా చెప్పింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి వెండీ షెర్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. యుక్రెయిన్ పై రష్యా దాడులను అడ్డుకోవడానికి చైనా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, పుతిన్ వైఖరిని ఖండించడంలోనూ చైనా విఫలం చెందిందని వెండీ షెర్మన్ మండిపడ్డారు.

Russia Ban : పుతిన్ రివేంజ్.. జుకర్‌బర్గ్, కమలా హారిస్‌లపై బ్యాన్.. రష్యాలోకి నో ఎంట్రీ..!

మరోవైపు యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఇద్దరు అమెరికా మంత్రులు సందర్శించనున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌లు యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆదివారం భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జెలెన్‌స్కీ స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో భారీ ఆయుధాలను అందించాలని అమెరికాను కోరనున్నట్లు తెలిపారు. రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఈ ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని జెలెన్ స్కీ చెప్పారు.(America Warns China Again)

America: ఆ దేశంపై ఆధారపడటం ఆపేయండి.. భారత్‌కు సూచించిన అమెరికా..

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా బలగాల దాడుల్లో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల దిబ్బలుగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు