ఈ రెండేళ్ల పిల్లాడికి అస్థిపంజరమే ఫ్రెండ్ : దాంతోనే ఆటలు..తిండి, నిద్రా అన్నీ..

  • Published By: nagamani ,Published On : September 29, 2020 / 01:37 PM IST
ఈ రెండేళ్ల పిల్లాడికి అస్థిపంజరమే ఫ్రెండ్  : దాంతోనే ఆటలు..తిండి, నిద్రా అన్నీ..

Updated On : September 29, 2020 / 2:32 PM IST

American Boy :రెండేళ్ల పిల్లాడు వేటితో ఆడుకుంటాడు.కార్లు..బైకు బొమ్మలతో ఆడుకుంటారు. కానీ ఓబుడ్డోడు మాత్రం అస్థిపంజరంతోనే ఆడుకుంటాడు. ఆ అస్థిపంజరం ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. అదిలేనిదే తిండి కూడా తినడు. నిద్రపోడు. సాధారణంగా పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అస్థిపంజరాన్ని చూస్తే భయం వేస్తుంది. కానీ ఈ గడుగ్గాయి మాత్రం అస్థిపంజరమే నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ దానితోనే ఆడుకుంటాడు.


అమెరికాలోని ఉటా రాష్ర్టానికి చెందిన రెండేళ్ల థియో అనే పిల్లాడు. వాడికి అస్థిపంజరమంటే చచ్చేంత ప్రేమ. ప్రాణం. భోజనం, షాపింగ్, నిద్రపోయినా, టీవీ చూస్తున్నాసరే ఆ అస్థిపంజరం పక్కనుండాల్సిందే. లేకపోతే అరచిగీపెడతాడు. నానా అల్లరీ చేస్తాడు.ఇల్లు పీకి పందిరేసి పారేస్తాడు.ఆ అస్థిపంజరం నిజమైనదికాదు కేవలం బొమ్మ. కానీ అటువంటి బొమ్మతో ఆడుకునే ఈ రెండేళ్ల బుడతడిది చాలా డిఫరెంట్ అని మాత్రం అనుకోవాల్సిందే. 24 గంటలూ ఈ ఎముకల గూడులాంటి అస్థిపంజం బొమ్మతోనే వాడి లోకం. ఆ బొమ్మకో పేరు కూడా పెట్టాడు ‘బెన్నీ’అని.


ఈ మధ్య అమెరికాలో భారీ వర్షాలు కురవటంతో బేస్మెంటులో వరద నీరు రావటంతో థియో కుటుంబం సెప్టెంబర్ 15న సామాన్లను పై అంతస్తులోకి మారారు. ఆ సమయంలో థియోకి ఆ అస్థిపంజరం బొమ్మ ‘బెన్నీ’ కనిపించింది. అంతే దాన్ని చూసిన థియో తెగ ఆనందపడిపోయాడు. దాన్ని తెచ్చుకుని దాంతోనే ఆడుకుంటున్నాడు. దీంతో అతని తల్లి ఆ బొమ్మను వేరే చోట దాచేసినా ఊరుకోకుండా అరిచి ఏడ్చి అదిచ్చేవరకూ ఊరుకోవట్లేదట.


అప్పట్నుంచీ దాన్ని అంటిపెట్టుకునే ఉంటున్నాడట. ఆ బొమ్మ నుంచి థియో మనస్సు మరల్చటానికి వాళ్లమ్మ థియోను ఓ షాపుకెళ్లి వేరే బొమ్మలు కొనటానికి యత్నించింది. కానీ అవేవీ వద్దన్నాడీ బుడ్డోడు.పైగా ఆ షాపులో ఉండే ఓ కుక్క అస్థిపంజరం బొమ్మ కావాలనేసరికి వాళ్లమ్మ షాక్ అయ్యింది. ఉన్న అలవాటు మానిపిందామనుకుంటే ఇంకో అస్థిపంజరం కావాలంటున్నాడేంటీ దేవుడా? అని తలపట్టుకుంది. అది వద్దు నాన్నా..ఇంకో బొమ్మ కొంటానన్నా వినలేదు. అరిచి ఏడ్చి ఆ కుక్క అస్థిపంజరం బొమ్మ కొనేవారకూ ఊరుకోలేదు.


అటు మనిషి ఎముకల గూడు, ఇటు కుక్క ఎముకల గూడును ముందేసుకుని ఏవేవో ఆటలాడుకుంటూ ఉంటాడు. వాళ్లమ్మ భయంసైకాలజిస్టును సంప్రదించి విషయం చెప్పింది. దానికి వారు ఏం భయపడక్కర్లేదు. మీ పిల్లాడు ధైర్యవంతుడు..పిల్లలు నిజానికి భయపడరని, పెద్దలమే వాళ్లకు దెయ్యం, గియ్యం అని భయం నేర్పిస్తామని అది వారిలో పెద్ద అయ్యాక నిజంగా దెయ్యాలు ఉంటాయని నమ్ముతుంటారని అస్థిపంజరం బొమ్మలతో ఆడుకునే థియో గురించి ఏమీ భయపడక్కర్లేదని పిల్లల మానసికనిపుణులు చెప్పటంతో ఆమె కుదటపడిది. తరువాత తన పిల్లాడు ఆడుకునే ఆ అస్థిపంజరం బొమ్మల్ని సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి వైరల్ అయ్యాయి.


అస్థిపంజరం బొమ్మలు ఇష్టపడుతున్నాడని ఆందోళన చెంది.. టేస్ట్ బొమ్మలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. పిల్లలు నిజానికి భయపడరని, పెద్దలమే వాళ్లకు దెయ్యం, గియ్యం అని భయం నేర్పిస్తామని మానసికనిపుణులు చెబుతున్నారు.