6, 7 డిగ్రీలు అంటేనే అమ్మో, అయ్యో, బాబోయ్ చలి అంటున్నాం.. అదే మైనస్ 50 డిగ్రీలు అంటే ఎలా ఉంటుంది. మంచు తప్పితే ఏమీ ఉండదు. రక్తం కూడా గడ్డకట్టుకుపోయే పరిస్థితి. ఇలాంటి సిట్యువేషన్ లో ఉన్నారు అమెరికా పోలార్ వోర్టెక్స్ జనం. నీళ్లు అనేవి లేవు. అంతా మంచుగడ్డలే. టాయ్ లెట్ లోని వాటర్ సైతం మంచుగా మారిపోతుంది. హీట్ చేసుకుని మరీ మంచినీళ్లు తాగుతున్నారు. శరీరంలో బ్లెడ్ కూడా బాయిల్ చేసుకోవాల్సి వస్తోంది. రోడ్డుపైకి వచ్చే జనం జుట్టు కూడా క్షణాల్లో అట్టకట్టిపోతుంది. అమెరికా కాదు అంటార్కిటికాలో ఉన్నాం అంటున్నా అక్కడి ప్రజలు.
మరిగే నీళ్లు మేఘాలుగా మారిపోతే :
పోలార్ వోర్టెక్స్ లోని ఓ వ్యక్తి తీసిన వీడియో వైరల్ అయ్యింది. పొయ్యిపై మరిగే నీళ్లను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి.. గాల్లోకి చల్లుతాడు. ఆ మరిగే నీళ్లు మంచులా మారి.. మేఘాలుగా మాయం అవుతాయి. ఈ వీడియో అమేజింగ్ అంటున్నారు నెటిజన్లు. మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. వేడినీళ్లు ఇలా మారిపోవటం అంటే.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఉన్నారో స్పష్టం అవుతుంది. అంత వేడి నీళ్లు శరీరంపై పడితే కాలిపోవటం ఖాయం.. ఇప్పుడు అయితే మంచుగా మారిపోతున్నాయి క్షణాల్లో. ఈ వీడియో తర్వాత ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు ప్రజలు. కొందరు జుట్టుతో.. మరికొందరు నీళ్లతో.. మరికొందరు మంచుగడ్డలతో గేమ్స్ ఆడుతున్నారు.
నదులు గడ్డకట్టాయి : వెదర్ ఎమర్జెన్సీ
నదులు, చెరువులు గడ్డకట్టుకుపోవటంతో అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో వెదర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రవాణా స్తంభించింది. విమానాలు రద్దు అయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సిట్యువేషన్ లోనూ ప్రజలు ఇలాంటి ప్రయోగాలతో ఎంజాయ్ చేయటం విశేషం.
Bolling water vs -33 degrees temp. #PolarVortex pic.twitter.com/JvPSwNwUab
— Jeff Lahti PT (@JeffLahti5) January 31, 2019