అక్కడ 65రోజులు అంధకారమే.. జనవరి వరకూ పగలు రాదట

బారోవ్‌గా పిలిచే అలస్కాలోని ఉగ్గియాగ్విక్ అనే పట్టణంలో 65రోజులు చీకటిగానే ఉంటుందట. అమెరికాకు ఉత్తర దిశగా ఉండే ఈ ప్రాంతంలో సూర్యుడు పూర్తిగా కనిపించకపోవడమే కారణం. చివరి సారిగా అక్కడి ప్రజలు నవంబరు 18 సోమవారం మధ్యాహ్నం 1గంట 50నిమిషాలకు సూర్యుడ్ని చూశారట. అలస్కా స్టాండర్ట్ టైమ్ అనేది ఈస్టరన్ స్టాండర్ట్ సమయానికి నాలుగు గంటలు ఆలస్యంగా ఉంటుంది. 

ఈ 65రోజుల అంధకారం కొనసాగుతూ.. 2020 జనవరి 23వరకూ ఉంటుందని అలాస్కా వాతావరణ ఛానెల్ ఒకటి చెప్పింది. ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరంగా ఉండటంతో ఆర్కిటిక్ విలేజ్‌లో 27రోజుల పాటు చీకటిగా ఉంటుందని, అదే ఉగ్గియాగ్విక్ ప్రాంతంలో 65రోజుల అంధకారం ఉంటుందని వెల్లడించింది. 

దీని ఉద్దేశ్యం ఉగ్గియాగ్విక్, ఆర్కిటిక్ సర్కిల్ ఉత్తర ప్రాంతాలు పూర్తిగా చీకటిలో ఉంటాయని కాదు. సూర్యుడు అక్కడి భూతల సమాంతరాని కంటే 6డిగ్రీలు తక్కువగా ఉండటంతో వస్తువులు చూడగలిగేంత కాంతి మాత్రమే వస్తుంది. ఇది కూడా రోజుకు 6గంటలు మాత్రమే ఉంటుంది. క్రిస్మస్ ముందురోజుల్లో ఆ వెలుగు 3గంటలకు తగ్గే అవకాశముంది. 

నవంబరు నెలారంభం నుంచే సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో మంచుగడ్డలు మొదలయ్యాయట. 1980లలో కనిపించిన వాతావరణం మళ్లీ కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

@AlaskaWx @IARC_Alaska pic.twitter.com/Ym8WqpH8cM

ట్రెండింగ్ వార్తలు