అగ్రదేశం అమెరికా.. టోర్నడో ధాటికి భయంతో వణికిపోతుంది. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు ప్రజల్లో ప్రాణ భయాన్ని పుట్టిస్తున్నాయి. టెక్సాస్ సిటీ దాంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఈ ప్రకృతి బీభత్సాలకు పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మంచు తుఫాను, వరదలు, టొర్నడోలు వారి జీవితాలను కుదిపేస్తున్నాయి.
Read Also : మళ్లీ చైనా అడ్డుపుల్ల : అజర్‌పై ఉగ్ర ముద్ర వేసేందుకు అభ్యంతరం
టెక్సాస్‌లోని జాతీయ సముద్ర వాతావరణ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పున్నారు. ఈ తుఫాను ఎన్నడూ లేనంతగా నష్టాన్ని కలుగజేసిందని పేర్కొన్నారు. ఈ తుఫాన్ ధాటికి తట్టుకోలేక 500 వందల మంది డ్రైవర్లు తమ కార్లను కొలొరొడే హైవే మీదనే వదిలేసి వెళ్లిపోతున్నారు. తుఫాన్‌లో చిక్కుకుపోయిన కార్‌ను నెట్టేందుకు కిందకు దిగిన అధికారిని మరో కారు ఢీకొనడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేదారిలోనే మరణించాడు.
Read Also : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు ఇబ్బందులు.. సైబర్ దాడులు జరిగాయా?
దాదాపు కొన్ని హైవేలను తాత్కాలికంగా మూసేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చలితో వణికిపోతున్న జనం ప్రాణాలను కాపాడుకునేందుకు ఆసుపత్రులకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. ఇక ఎయిర్‌పోర్టుల సంగతి చెప్పనక్కర్లేదు. వందల కొద్దీ విమానాలు విమానాశ్రయాల నుంచి బయటికి పోకుండా ఆపేశారు. భయానక వాతావరణం నుంచి కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. పశువులు, వాహనాలు, ఆస్తులు అన్నీ రకాలుగా నష్టపోతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.
Read Also : యుద్ధానికి సేనాని సిద్ధం : పవన్ కళ్యాణ్ సమర శంఖం