Afghan President : అప్ఘాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అమృల్లా సల్లేహ్

అప్ఘానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్..మంగళవారం తనుని తాను దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

Amruth

Afghan President అప్ఘానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్..మంగళవారం తనుని తాను దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు అమృల్లా సల్లేహ్ ఇవాళ సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. అప్ఘానిస్తాన్ రాజ్యాంగం ప్రకారం..అధ్యక్షుడు లేకున్నా,పారిపోయిన,రాజీనామా చేసినా లేదా మరణించినా ఉపాధ్యక్షుడే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఉంటారని ఆ ట్వీట్ లో తెలిపారు.

తాను ఇప్పుడు దేశంలోనే ఉన్నానని మరియు తానే చట్టబద్దమైన ఆపద్ధర్మ అధ్యక్షుడినని సల్లేహ్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాను ఇప్పుడు దేశంలోనే ఉన్నానని చెప్పారు సలేహ్. కాగా, ఆదివారం ఉదయం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించిడంతో అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే.
Read Afghanistan: కార్లు,హెలికాఫ్టర్ నిండా డబ్బుతో..అప్ఘానిస్తాన్ నుంచి పారిపోయిన ఘనీ