Afghanistan: కార్లు,హెలికాఫ్టర్ నిండా డబ్బుతో..అప్ఘానిస్తాన్ నుంచి పారిపోయిన ఘనీ

ఆదివారం ఉదయం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించిడంతో అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే.

Afghanistan: కార్లు,హెలికాఫ్టర్ నిండా డబ్బుతో..అప్ఘానిస్తాన్ నుంచి పారిపోయిన ఘనీ

Ghani

Afghanistan ఆదివారం ఉదయం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించిడంతో అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. అయితే అష్రఫ్ ఘనీ..భారీగా నగదు నిండిన నాలుగు కార్లు,ఓ హెలికాఫ్టర్ తో దేశం వదిలి పారిపోయాడని కాబూల్ లోని రష్యా ఎంబసీ సోమవారం తెలిపింది.

అయితే తీసుకెళ్లే వీలు లేక ఇంకా కొంత నగదుని అప్ఘానిస్తాన్ అధ్యక్ష భవనంలోనే ఘనీ వదిలేశాడని రష్యా ఎంబసీ తెలిపింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని రష్యన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఇస్చెంకో తెలిపారు.ఇక,ప్రవర్తన ఆధారంగా తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తిస్తామని రష్యా తెలిపింది. అఫ్ఘానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడం లేదా గుర్తించకపోవడం అనే దానిపై రష్యా తొందరపడదని… తాలిబాన్ తిరుగుబాటుదారులు నాయకత్వం వహిస్తారని భావిస్తున్నామని…తాలిబన్‌ ప్రభుత్వ పని తీరును గమనించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియమించిన అఫ్ఘనిస్థాన్‌ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ సోమవారం తెలిపారు.

కాగా,అష్రఫ్ ఘనీ..భార్య, చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారుతో కలిసి తొలుత ఉజ్బెకిస్తాన్ పారిపోయినట్లు వార్తలు రాగా..సోమవారం ఆ వార్తలను ఉజ్బెకిస్తాన్ ఖండించింది. అష్రఫ్ ఘనీ తమ దేశంలోకి రాలేదని ప్రకటించింది. అయితే తజికిస్తాన్ లో అష్రఫ్ విమానం ల్యాండింగ్ కు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో…ఒమన్ దేశానికి అప్రష్ ఘనీ వెళ్లినట్లు సమాచారం. కాగా,ప్రస్తుతం ఒమన్ లో ఉన్న అష్రఫ్ ఘనీ అమెరికా వెళ్లేందుకు రెడీ అయినట్లు తెలుస్తొంది.